అన్ని రకాల పొత్తులకు తెరలేపాక, ఏదీ అంతే ఉపయోగపడే రకంగా లేకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు కొత్త పొత్తుకు సిధ్ధమయ్యారు. గతంలో వేణు స్వామి ఓ ఇంటర్వూలో “చంద్రబాబు యాగం చేసుకుని ఉంటే ఫలితముండేదనీ, కానీ బాబు ఎవరి మాటా వినరనీ, తిరిగి నాకే చెబుతారని” అనడం మనందరికీ తెలిసిందే.
జగన్ కొట్టిన దెబ్బకి అధికారం కోల్పోయి, అమరావతి చెడిపోయి, సంవత్సరం పాటు హైదరాబాద్లో, మరొక సంవత్సరం కేవలం అమరావతి గ్రామాల్లో, ఇంకో రెండు నెలలు జైలులో ఉండేసరికి బాబుకి తన కన్నా మించిన శక్తి ఉంటుందనీ, తనకి తెలిసిందే వేదం కాదనే విషయం తెలిసొచ్చినట్టుంది.
దెబ్బకి ఇప్పుడు ఉండవల్లి నివాసంలో యాగం మొదలుపెట్టారు. చంద్రబాబు నివాసంలో మూడు రోజులపాటు రాజశ్యామల యాగం జరగనుంది. ఈ రాజశ్యామల యాగంలో చంద్రబాబు,భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఉదయం 9 నుండి 12:00 వరకు, తిరిగి సాయంత్రం 6:00 నుండి 9:00 వరకు రాజశ్యామల యాగం కొనసాగింది.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించుకున్నారనీ, దుర్గ గుడి విగ్రహాలను హైదరాబాద్ రప్పించుకుని అక్కడ యాగాలు చేసుకున్నారని బాబు మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగత దోష నివారణ కోసం రాజ్యశ్యామల యాగం చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెప్పినా, అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా కూల్చిన దేవాలయాలు, కుటుంబాల ఉసురు ఊరికే పోకుండా బాబుకి ఇలా తగులుకుంది. ఎన్ని యాగాలు చేసినా బాబుకంటిన మకిలి పోదు కదా!!