Chandrababu : 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు (chandrababu) నాయుడి వ్యవహారశైలిలో చాలా మార్పు వచ్చింది. నా అంతటి వాడు లేడు. నేను ఏమి చెప్పినా జనం నమ్మేస్తారని అనుకున్న వ్యక్తి జగన్ దెబ్బకు నేల మీదకు వచ్చాడు. అయితే అధికారం లేక తల్లడిల్లిపోవడం మొదలుపెట్టాడు. 2024లో ఎలాగైనా గెలవాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే కుట్రలు మొదలుపెట్టాడు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అవన్నీ కొట్టుకుపోయాయి. దీంతో సభల్లో జనాన్ని తిట్టడం, బెదిరించడం ప్రారంభించాడు. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే మీకు సిగ్గుందా.. మనుషులేనా.. రోషం లేదా?.. అంటూ తనకు అధికారం ఇవ్వని ప్రజలపై ఆగ్రహం చూపించాడు. ఇది వర్కౌట్ కాలేదని తన భార్య భువనేశ్వరిని ఏదో అన్నారంటూ ప్రెస్మీట్లో ఏడుపు అందుకున్నాడు. అయితే వేటినీ జనం నమ్మలేదు. జస్ట్ తెలుగుదేశం సోషల్ మీడియా నాలుగు రోజులు పోస్టులు పెట్టుకుంది అంతే.. 2024 ఎన్నికలు సమీస్తున్నాయి.. ఎలాగోలా ఈసారి గట్టెక్కాలని బాబు కొత్త పాట ఎత్తుకున్నాడు.. జనం ఆదరించకపోతే రాజకీయాలు విరమించుకుంటాడంట.
ఇటీవల ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ అయిన రిపబ్లిక్ టీవీ బాబును ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా యాంకర్ అర్నాబ్ గోస్వామి టీడీపీ అధినేతను పలు ప్రశ్నలు వేశారు. మీరు నిజంగా రాజకీయాల నుంచి విరమించుకుంటారా?, లేక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డ్రామా ఆడుతున్నారా? అని ప్రశ్నించగా దీనికి బాబు అవునని సమాధానమిచ్చారు. తనకు వచ్చిన అరకొర ఇంగ్లిష్‌లో ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని, వాళ్లు తనను వద్దనుకుంటే విరమించుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
చంద్రబాబంటేనే మోసగాడు. అబద్ధాలరాయుడు. అలాంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ను ఎలా నమ్మగలం. జనాన్ని తిట్టినా నమ్మలేదు. ఏడ్చినా నమ్మలేదని ఇలా రాజకీయాలు విరమించుకుంటానని బాబు బెదిరింపులకు దిగాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. వయసైపోయిందని ప్రజలు సానుభూతి చూపిస్తారేమోనని ఈ మాటలు చెప్పి ఉండొచ్చని, నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది. కుమారుడు లోకేశ్ ఇంకా పరిణితి చెందలేదు. భవిష్యత్‌లోనూ ఆ అవకాశం లేదు. అతని చేతిలో పార్టీ పెడితే నాయకులు ఒప్పుకోరు. జూనియర్ ఎన్టీఆర్ లేదా నందమూరి ఫ్యామిలీ చేతికి తాళం ఇవ్వలేడు. అందువల్ల రేపు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా బాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ జీవిస్తాడు తప్ప రాజకీయాలు వదిలి ఉండలేడు. బాబు గారూ.. జరిగే పనులు ఏమైనా ఉంటే చెప్పిండి. బిల్డప్ బాబాయ్ మాటలు వద్దు..
– వీకే..