తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్టవుతుంది చంద్రబాబు పరిస్థితి. ఎన్నికలు వచ్చినపుడు సీట్లు సర్దుబాటు విషయంలో విపరీతమైన నాన్చివేత ధోరణి పాటించే బాబుకి… ఇప్పుడు పొత్తు విషయంలో మిగతా పార్టీల వారు కూడా అటువంటి నాన్చివేత ధోరణిలో ఉండటంతో తలనొప్పులు మొదలయ్యాయి.
మొదలూ తుది అంటూ లేకుండా బాబుకి జనసేన తమ మద్దతుని అందిస్తూ స్నేహహస్తాన్ని పదే పదే అందిస్తుంది కానీ… పవన్ కళ్యాణ్ ఇచ్చే మద్దతు ఎంత మైలేజి ఇస్తుందో అనే అనుమానాలను తెలంగాణ ఎన్నికలు కలిగించాయి. చిన్నమ్మ, పవన్ ద్వారా బాబు తన మనసులోని మాటను బీజేపీ ముందుంచారు. కానీ బీజేపీ మద్దతు కావాలంటే, అధికారం వస్తే సీఎం పదవిలో షేర్ కావాలి అని డిమాండ్ పెట్టింది. సొంత మామనీ వెన్నుపోటు పొడిచి లాక్కున్న అధికారంలో బావమరిదికీ , తోడల్లుడికీ సీటులో భాగమివ్వని బాబు బీజేపీని పక్కన కుర్చోబెట్టుకుంటాడు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
దీనితో ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా ఉంది బాబు పరిస్థితి. పవన్‌కి సీయం సీటు ఇచ్చేదే లేదు బాబే సీయం అంటూ లోకేష్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు కూడా. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న బాబు బీజేపీ మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం అనవసరం అనే భావనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.