2014 – 19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతాఇంతా కాదు. ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేసిన చరిత్ర ఆయనది. కొంతకాలం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఇంటి అద్దెలు, కార్యాలయ మరమ్మతులు, ఫర్నిచర్ తదితర వాటికి ఇష్టానుసారంగా ఖజాజాలో నుంచి తీసి వాడేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని విజయవాడకు వచ్చాక కూడా బాబు మారలేదు. ఇక అమరావతి పేరుతో చేసిన షో అయితే ఇంకా అందరి కళ్లముందే ఉంటుంది. విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, ఆయన మంత్రులతో విదేశాలకు వెళ్లడం, ప్లాన్స్ అంటూ కోట్లాది రూపాయలు వాడేశారు. తీరా చూస్తే రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశాక టీడీపీ చాలా అతి చేసింది. జనం సొమ్ముతో రాజకీయాలకు పాల్పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని తిట్టడానికి బాబు ప్రజల డబ్బుతో ఢిల్లీలో దీక్షలు పెట్టారు. దీనికి ప్రత్యేక రైళ్లలో తెలుగు తమ్ముళ్లను తీసుకెళ్లారు. వారికి స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు.
ప్రత్యేక విమానాల ప్రయాణానికి.. రూ.100.00 కోట్లు, హైదరాబాద్ సీఎం కార్యాలయానికి (ఎల్ బ్లాకు) రూ.14.63 కోట్లు, హైదరాబాద్‌లో తొలుత సీఎం కోసం హెచ్ బ్లాక్‌కు రూ.6.29 కోట్లు, లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ (హైదరాబాద్) కోసం రూ.9.475 కోట్లు, సీఎం కార్యాలయ ఫర్నిచర్ ఖర్చు రూ.10.00 కోట్లు, మదీనాగూడ ఫాంహౌస్, జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి రూ.4.37 కోట్లు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సీఎం క్యాంపు ఆఫీస్ విజయవాడకు రూ.42 కోట్లు, సీఎం ప్రత్యేక బస్సు కోసం రూ.5.50 కోట్లు, రాజధాని ప్రధాన శంకుస్థాపనకు రూ.250 కోట్లు, ఆ తర్వాత మూడు శంకుస్థాపనలకు రూ.100 కోట్లు, హైదరాబాద్ – విజయవాడ మధ్య అధికారుల ప్రయాణం కోసం రూ.120 కోట్లు, రాజధాని కన్సల్టెంట్ల ఖర్చు రూ.300 కోట్లు, తాత్కాలిక సచివాలయం, ఇతర మరమ్మతుల కోసం రూ.1,100 కోట్లు, జన్మభూమి కార్యక్రమాలకు రూ.125 కోట్లు, నవనిర్మాణ దీక్షలకు రూ.80 కోట్లు, విదేశీ పర్యటనలు, రోడ్డు షోలు (అందరూ కలిపి రూ.120 కోట్లు, పోలవరం బస్సు యాత్రలకు రూ.22 కోట్లు, హ్యాపీ సీటిస్ సదస్సుకు రూ.61 కోట్లు, భాగస్వామ్య సదస్సులకు రూ.150 కోట్లు.. మొత్తం కలిపి రూ.2,620.76 కోట్లను మొదటి నాలుగు సంవత్సరాల్లోనే దుబారాగా ఖర్చు చేశారు.
ఎంతో డబ్బును దుబారా చేసిన బాబు ఇప్పుడు సంపద సృష్టి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు విజన్ ఉందని నారా వారు నిత్యం చెబుతుంటారు. అదంతా అభూత కల్పన. అధికారాన్ని ఎంజాయ్ చేయడం మాత్రమే ఆయనకు తెలుసు. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేయడం.. అందినకాడికి దోచుకోవడం ఇదే రీతిలో వ్యవహరించారు.