టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని కీరీటం తగిలించుకున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ శంఖారావం పేరిట చేస్తున్న యాత్రలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు తిరిగి టీడీపీకి, చంద్రబాబు పాలనకే చుట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. పాలక పక్షమైన వైసీపీపై నిందలు మోపి రానున్న ఎన్నికల్లో లబ్దిపొందుదాం అనుకుంటున్న లోకేష్ చివరికి తన ప్రసంగాలతో ప్రజల్లో నవ్వులపాలవుతున్నాడనే వాదన టీడీపీ శ్రేణులనుండే వినిపిస్తుంది..
గడిచిన 5ఏళ్ళ చంద్రబాబు పాలనలో ఫలానా మంచిపని మేము చేశాం అని ఒక్కటి కూడా నారాలోకేష్ కి ప్రజల్లో చెప్పుకోవడానికి లేక వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలను పలుకుతూ అవే మాకు ఓట్లు తెచ్చిపెడతాయనే భ్రమలో పూర్తిగా మునుగిపోయినట్టు కనిపిస్తుంది. మద్యం బ్రాండ్ల దగ్గర నుండి పన్నుల వరకు అన్నీ జగన్ పై రుద్దేసి ప్రజల నుండి ఓట్లు కొల్లగొడదాం అన్నట్టు ఉన్న లోకేష్ వైఖరిని చూసి తెలుగు తమ్ముళ్ళే తలలు పట్టుకుంటున్నారు.
వైసీపి ప్రభుత్వం తెచ్చిందని చెబుతున్న మధ్యం బ్రాండ్లు బూం బూం బీర్, ప్రెసిడెంట్ మెడల్ అన్నీ చంద్రబాబు పాలనలోనే వచ్చినట్టు ఇప్పటికే తేదిలతో సహా బయటపడటంతో మద్యం బ్రాండలపై చేస్తున్న ప్రచారాన్ని తగ్గించి ఇప్పుడు చెత్తపన్ను అంటూ మరో రాగం అందుకుని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్
నిజానికి ఈ చెత్తపై పన్ను కూడా బాబు పుణ్యమేనని రికార్డులు తిరగేస్తే బయటపడుతున్న సత్యం. ‘చెత్తమీద పన్ను వేస్తారా?’ అని ప్రచారం చేస్తున్నా, తీరా చూస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం గతంలో చంద్రబాబు ప్రభుత్వమే చెత్త పన్నును అమలు చేసిందని తాజాగా వచ్చిన ఆధారాలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ కేంద్రాన్ని ఒక్క మాట అనరు. ఇందులోనే కాదు, ఏ విషయంలో అయినా అంతే.
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఇద్దరే , అసత్యాలు పలికితే చాలు ఎన్నికల్లో గెలిచేస్తాం అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి తమ జీవితాలను , రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారని, చంద్రబాబు కాలం చెల్లిన నేతగా మాట్లాడుతున్నారని, ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని లోకేష్ కూడా వాళ్ళ నాన్న చంద్రబాబు బాటలోనే ఉండటం చూస్తే టీడీపీకి ఇక ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయనే వాదన టీడీపీ వర్గాల నుండే వినిపిస్తుంది.