బాబు జమానా మొత్తం రకరకాల పన్నుల మోతతో నిండిపోయి ఉంది. ఔరంగజేబు కూడా అన్ని రకాల పన్నులు వేసి ఉండడు, చంద్రబాబు మాత్రం సామాన్యుల నడ్డి విరిచే పన్ను బాదుడులో ఏమాత్రం వెనక్కి తగ్గడు. వింతవింత పన్నులన్నీ శృష్టిస్తూ ఉంటాడు. అందులో ఒక వింత పన్నే ఇది..
1995 లో అధికారంలోకి రాగానే ప్రజల రక్తం పీల్చి ఖజానా నింపాలి అని, ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుస్తున్నా అనే సాకుతో పన్ను మోత మోగించిన బాబు, ఆఖరికి మట్టి మీద కూడా పన్ను వేసేసాడు..
సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి అంటే ఇటుక, బండరాళ్లు, మొజాయిక్ చిప్స్ మీద కూడా పన్ను కట్టాల్సిందే అని జిల్లాలను సెక్టార్ల వారీగా విభజించి పన్ను నిర్ధారించాడు.. ఇటుక కోసం వాడే ఉచితంగా దొరికే మట్టిని కూడా పన్ను కట్టే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు. తద్వారా ఇటుక, బండరాయి, గులక రాయి కూడా పన్ను భారంతో ఖరీదైన వస్తువుగా మారి సామాన్యుడి ఇంటి కల విలాసవంతమైన వస్తువుగా మార్చి వారి కలలని చిదిమేశాడు..
అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కట్టి ఒక్క పేదవాడిని సొంతింటి వాడిగా చేయకపోగా, కూలీ నాలీ చేసుకుని చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారికి కూడా బాదుడు తప్పనిసరి చేసాడు.. మట్టిమీద కూడా పన్ను విధించాలి అన్న ఆలోచన బాబుకి మాత్రమే సాధ్యం కొత్త పన్నుల శృష్టిలో, పన్నుల భారం పెంచడంలో బాబుని మించిన ఘనుడు ఎవరూ లేరు..