వరికపూడిసెల అనేది పల్నాడు వాసుల యొక్క దశాబ్దాల కల, 1996 మార్చ్ లో పార్లమెంట్ ఎన్నికల ముందు వెలిగొండ, ఎస్సార్స్పీ రెండో దశ, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ లతోపాటు వరికపుడిసెలకు శంకుస్థాపన చేసిన బాబు 2004 వరకు రూపాయి ఖర్చు కూడా చేయలేదు. పైపెచ్చు 1999 లో గొంతు ఎండి, పొలం ఎండి గుక్కెడు నీళ్లు పంట పొలాల కోసం అడిగిన పల్నాడు రైతులపై, నీళ్లు విడుదల చేసేది లేదు, ఇప్పుడు నీళ్లు వదిలితే మళ్లీ మళ్లీ అడుగుతారు, రైతులకు క్రమశిక్షణ నేర్పాలంటే ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని రైతులకు క్రమశిక్షణ నేర్పే అహంకారం ప్రదర్శించాడు.. ఆ అహంకార ఫలితం రైతాంగం అప్పుల ఊబిలో పడి తమ కిడ్నీ లు అమ్ముకుని అప్పు తీర్చాల్సిన ఖర్మ పట్టడం. రాష్ట్రంలో 2000-2004 మధ్య బాబు హయాంలో కిడ్నీ లు అమ్మి అప్పు తీర్చే దౌర్భాగ్య స్థితి మొదట మొదలైంది మాచర్ల నియోజకవర్గం నుండే…
2008 లో జలయజ్ఞంలో భాగంగా వైయస్సార్ వరికపుడిసెల కు శంకుస్థాపన చేయగా 2009 లో ఆయన మరణించారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇంచు ముందుకు వెళ్లలేదు. 2014 లో అధికారంలోకి వచ్చిన బాబును అసెంబ్లీ సాక్షిగా వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపుడిసెల ను నిర్మించాలని కోరగా, ఆ ప్రాజెక్ట్ నిర్మించాలంటే కేంద్ర నిభందనాలు అడ్డంగా ఉన్నాయి , పర్యావరణ అనుమతులు సాధించడం అసాధ్యం, ఆ ప్రాజెక్ట్ నిర్మించలేం అని సాక్ష్యాత్ ముఖ్యమంత్రి హోదాలో బాబే ప్రకటించాడు…
2018 లో మాచర్ల పర్యటనలో భాగంగా లోకేష్ ను స్థానిక రైతాంగం వరికపుడిసెల ను నిర్మించాలని కోరాగా, స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మమ్మల్ని అడగలేదు, ఒకవేళ ముందే అడిగి ఉంటే కట్టేవాళ్లం కదా అని వారి తండ్రి గారు అయిన బాబు అసెంబ్లీ లో అన్న మాట కూడా గుర్తు లేకుండా విమర్శ చేశాడు.. 2019 ఫిబ్రవరి లో అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరికపుడిసెల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నామ్ అంటూ 340 కోట్లతో జీవో విడుదల చేసి టెండర్లని పిలుస్తున్నాం అని ప్రకటించాడు, అప్పటికి ఒక్క పర్యావరణ అనుమతి కూడా రాలేదు. ప్రాజెక్ట్ అనుమతులు లేకుండా కనీసం ఐదేళ్లలో ఎన్నడూ అనుమతులు కొరకు ప్రయత్నం చేయకుండా, టెండర్లను కూడా పిలుస్తున్నాం అంటూ అదీ ఎన్నికలలు రెండు నెలల ముందు నాటకం ఆడడం బాబు చెత్త బుద్ధికి నిదర్శనం..
ఇక 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లు కోవిడ్-19 కారణం గా దేశం మొత్తం ఎలాంటి మౌలిక వసతుల పనులు చేపట్టలేకపోయింది. మిగిలిన మూడేళ్లలోనే, అతి కష్టం అయిన పర్యావరణ అనుమతులు, అందునా టైగర్ రిజర్వ్ ఉన్న ప్రాంతం అయినా అనుమతి సాధించడం అంటే ఎంత కష్టంతో కూడిన పనో టీడీపీలో జాయిన్ అయిన నర్సరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలే టీడీపీ వారి సభలోనే చెప్పాడు, ఈ ప్రాజెక్ట్ ల్ అత్యంత కష్టమైన భాగం అనుమతులు సాధించడమే, దేశంలో టైగర్ రిజర్వ్ ఉన్న చోట ప్రాజెక్ట్ కట్టడానికనుమతి లభించిన ఏకైక ప్రాజెక్ట్ వరికపూడిసెల అని ఆయనే చెప్పాడు..
అలాంటి క్లిష్టతరమైన అనుమతులు అన్నీ సాదించి ప్రాజెక్ట్ నిర్మాణానికి చిత్తశుద్ధితో శరవేగంగా పనులు చేస్తుంది ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ కు రూపాయి ఖర్చు చేయకపోగా, నీరడిగిన రైతుపై ఆగ్రహించేది బాబు అయితే, ఎన్నికలతో సంబంధం లేకుండా ఎంత కష్టమైనా ప్రాజెక్ట్ కట్టాల్సిందే అని చిత్తశుద్ధితో ముందడుగు వేసిది జగన్…మళ్ళీ ఎన్నికల వేలయ్యింది బాబుతో పాటు, లోకేష్, జూలకంటి బ్రహ్మా రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు మాకు ఓటేస్తే వరికపూడిసెల నిర్మిస్తాం అంటున్నారు.
ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ప్రజలే వరికపూడిసెల పై ఎవరిది చిత్తశుద్ధి ఎవరిది చెత్తబుద్ది. ప్రతి ఎన్నికల ముందు వరికపూడిసెలని ప్రచారస్త్రంగా వాడుకొని మోసం చేస్తుంది ఎవరు. తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చడానికి నిబద్దతతో కృషి చేస్తుంది ఎవరు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు.