1996 లో పాశం జగన్నాథ నాయుడు అనే జర్నలిస్టు వార్త దినపత్రికలో రాసిన ఆర్టికల్ ఇది..
అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను రక్షించడం, నిజాయితీ గల అధికారులను శిక్షించడం బాబుకు ఆనవాయితీ..
భూకబ్జాదారులను సమర్థవంతంగా ఎదుర్కుంటూ ప్రభుత్వ ఆస్తులను కాపాడిన హైదరాబాద్ కలెక్టర్ ఆర్. సుబ్రహ్మణ్యంను, నగరంలో దురాక్రమణాదారుల ఆటకట్టించిన మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ సుజాతారావు ను, ఎక్సైజ్ శాఖ లో కమీషనర్ లు గా పని చేసి అక్రమ మద్యం రవాణాను అరికట్టిన మహంతి, దినేష్ రెడ్డి లను బాబు బదిలీ చేసి ప్రాధాన్యత లేని శాఖల్లో పడేశాడు…
అంతేకదా నిజాయితి గల అధికారులు ఉంటే హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను కబ్జా చేయడం తనకెలా సాధ్యం అవుతుంది, నిజాయితీ గల అధికారి కమీషనర్ గా ఉంటే తనవారికి దొడ్డిదారిలో భూముల పందేరం ఎలా సాధ్యం అవుతుంది…
అలాగే అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం ఎత్తివేసి రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను, బెల్టు షాపులను తెరిచి దళారుల దగ్గర వాటా తీసుకున్న బాబు కు నిజాయితీ గా అక్రమ మద్యం రవాణాను అడ్డుకునే అధికారులు ఉంటే తన కమీషన్లు, తనవారి మద్యం వ్యాపారం ఎలా సాఫీగా సాగుతుంది… అందుకే బదిలీలు అనే పేరుతో శిక్షలు వేస్తుంటాడు..
ఇక తన హయాంలో అధికారులు ఎలా ఉండాలో ఆయన దగ్గర ఒక నియమాల పట్టిక ఉంది…
రెండు వేర్వేరు ప్రధాన శాఖల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న అధికారులు, అవినీతీ, లంచగొండితనం ఆరోపణలు ఎదుర్కుంటున్నా వారిపై చర్యలు ఉండవు, విచారణ కూడా ఉండదు.. ఇక లంచం తీసుకుంటూ ఏసీబీ కే పట్టుబడ్డ లోకల్ ఫండ్ ఆడిట్ విభాగం డైరెక్టర్ సైదులు పై అసలేం చర్యలు తీసుకోలేదు, ఏసీబీ పట్టుకున్న 26 లక్షల నగదును రికవర్ చేసుకోవడానికి తెల్లారి నుండే ఏదేచ్ఛగా లంచాలు స్వీకరించే కారక్రమం మొదలు పెట్టాడు… ఏసీబీ అధికారులు ఆ అధికారిని బదిలీ చేయమని నివేదిక ఇచ్చినా కూడా బదిలీ ఊసే లేదు…
ఇక సమాచార శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వం 7-8 పత్రికలకు ప్రకటనలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి రెండు పత్రికలకు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తే జె.పి మూర్తి అనే అధికారి విచారణలో అది నిజమేనని అవినీతి జరిగిందని రిపోర్ట్ ఇవ్వగా దాన్ని కనీసం పట్టించుకోలేదు, ఆ అధికారి బదిలీ కూడా జరగలేదు.. ఎందుకంటే ఆ రెండు పత్రికలు ఏవో అందరికీ తెల్సిన విషయమే. తను సీఎం కుర్చీ ఎక్కడానికి సాయపడ్డ పత్రికాధినేతకు బదులు సాయం గా తానే చేసిన అవినీతి ఇది…
ఇలా తన పాలనలో అధికారులు తనకు నచ్చినట్లు గానే ఉండాలి.. నిజాయితీ గా ఉంటే బదిలీలు తప్పవు, అవినీతి చేస్తూ తనకు నచ్చిన పనులు చేసిపెడుతూ, వారి అవినీతిలో తనకు వాటా ఇచ్చే అధికారులకు ఎన్ని ఆరోపణలు వచ్చినా బదిలీలు ఉండవు, పైగా త్వరగా ప్రమోషన్లు కూడా వస్తుంటాయి…