పదవీ కాంక్షతో లక్ష్మీ పార్వతిని సాకుగా చూపి, ఎన్టీఆర్ కి నైతిక విలువలు లేవని, అవినీతిపరుడు అని, ప్రజాస్వామ్యబద్ధ పాలన జరగడం లేదని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయనను గద్దె దింపి సీఎం అయిన చంద్రబాబు గురించి “జామాతా దశమ గ్రహం” అంటూ ఎన్టీఆర్ ఒక ఆడియో క్యాసెట్టును రిలీజ్ చేశాడు..
మీ అన్నను మాట్లాడుతున్నా శ్రద్దగా ఆలకించండి అంటూ మొదలు పెట్టి తనను గద్దె దింపడం లో చంద్రబాబు పాత్ర గురించి, అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పాత్ర గురించి, స్పీకర్ యనమల రామకృష్ణుడు తనని ఎలా అవమానించింది తదితర అంశాల గురించి తానే స్వయంగా వివరిస్తూ ఆడియో రికార్డ్ చేసి రాష్ట్రవ్యాప్తంగా క్యాసెట్టులు పంచేందుకు ఎన్టీఆర్ సిద్దం చేశాడు..
అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మ. అలాంటిది లక్ష్మీపార్వతి గురించి బాబు చేసిన అబద్ధపు ప్రచారం, కార్యకర్తలకు ఎన్టీఆర్ అన్యాయం చేసాడని చెప్పి ఏ అన్యాయం చేశాడో చెప్పకపోవడం గురించి ప్రస్తావించడమే కాకుండా, తనకెంతో ఇష్టమైన తన కుమారుడు, తండ్రి మాట జవదాటని హరికృష్ణను మాయమాటలతో తనకు దూరం చేసి బాబు వైపుకు ఎలా తిప్పుకున్నది, కుర్చీ కోసం బాబు ఆడిన కపట నాటకం ఎలాంటిది లాంటివి వివరిస్తూ గాంధీని చంపిన గాడ్సే కన్నా చంద్రబాబు ఘాతకుడు అని ఆయన ఆవేదనను వెళ్ళగక్కారు, చివరిగా అనుకున్నది సాధించేవరకూ నిద్రపోడు ఈ ఎన్టీఆర్ అంటూ ముగించిన 42 నిమిషాలు నిడివి గల ఆ ఆడియో క్యాసెట్టు ద్వారా తనకు జరిగిన అన్యాయం ప్రజలందరికి తెలియటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంచాలని నిర్ణయించి పంపిణీ చేసారు…