చంద్రబాబు నాయుడు..ఈ పేరు వింటేనే రాజకీయంలో కుట్రలు కుయ్యత్తులకి కుతంత్రాలకి మారుపేరుగా చెబుతారు. తన లబ్ది కోసం ఎంతటి పనైనా చేయడానికి వెనకాడే వాడు కాదు చంద్రబాబు అని పేరు .. తాను ముఖ్యమంత్రి కావాలన్న కల కోసం ఏకంగా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పోడిచి ఆయన చావుకు పరోక్షంగా కారకుడైన వ్యక్తి ఈ చంద్రబాబు అని ఇప్పటికీ చెబుతూ ఉంటారు ఆనాడు రాజకీయాలను దగ్గరగా చూసిన ప్రజలు. చంద్రబాబు కుటుంభాల్లోనే కాదు త్న రాజకీయం కోసం సమాజంలో వర్గాల మధ్య కూడా ఆరని చిచ్చుని రగిల్చిన చరిత్ర ఆయన సొంతం.
యూట్యూబ్ లో చానల్ మాటున సమాజంలో వర్గాల మద్య నిత్యం చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే మహాసేన రాజేష్ లాంటి వారికి ఏకంగా పి.గన్నవరం లాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సీటు కేటాయించడం చూస్తే చంద్రబాబు మనస్తత్వం ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. అణగారిన వర్గాలకి అవకాశం ఇవ్వడం మంచిదే కానీ అణగారిన వర్గాల మాటున అరాచక శక్తిగా మారే మహాసేన రాజేష్ లాంటి వారిని ఎవరు ప్రోత్సహించినా అది సమాజంలో విపత్తుకే దారితీస్తుంది తప్ప నలుగురుకి మేలు చేయదు. ఇది చంద్రబాబుకి తెలియని విషయం కాదు అందుకే ఆ నియోజకవర్గంలో అటు టీడీపీ వారి ఇటు జనసేన వారు, అలాగే దళిత వర్గాలవారు ముక్త కంఠంతో తన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా పార్టీ ఆఫీసులకి తాళాలు వేసి నిరసన తెలిపినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు, దీంతో తన రాజకీయ లబ్దికోసం సమాజం విచ్చిన్నం అయిన పరవాలేదని చేసిన పనిగానే అందరు భావిస్తున్నారు.
గతంలో ఈ మహాసేన రాజేష్ హిందూ అమ్మాయిలని దళితులు లేపుకు వచ్చిన వారికి నగదు ప్రోత్సాహం ఇస్తాను అన్నాడు. కాపు సామాజిక వర్గం వారిని మా దళితుల ఓట్లు కావాలారా అంటూ రాయలేని భాషలో దూషించాడు, ఇంకో అడుగు ముందుకు వేసి ఏకంగా బాబా సాహేబ్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో వెనకబడిన వర్గాల వారికి కల్పించిన రిజర్వేషన్లు కూడా వద్దు అంటూ దళితులకి ఎందుకు రిజర్వేషన్లు అంటూ రిజర్వేషన్లు తీసుకుంటూ ఇంకా అంటరాని వారిగానే ఉందామా అంటూ తలాతోకా లేకుండా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉన్నాయి. ఇవన్ని చూసి కూడా చంద్రబాబు ఇతనికి శాసన సభ సీటు ఇచ్చాడంటే తన దరిద్ర భావజాలన్ని సమర్దిస్తునట్టే .
చంద్రబాబు చరిత్ర చూస్తే గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఆకర్షించడం కోసం తొలిసారిగా రిజర్వేషన్ల వర్గీకరణ జిఓ విడుదల చేసి అప్పటి వరకు మాల మాదిగల మధ్య ఉన్న సోదరభావాన్ని దూరం చేసి ఆ మంటలో చలి కాచుకున్నాడు. దీనికి మందకృష్ణ మాదిగ గారిని పావుగా వాడుకున్న చంద్రబాబు ఈ వర్గీకరణ చిచ్చులో ఇప్పటికీ చలి కాచుకుంటున్నాడు. 1959లో రాష్ట్రపతి సంతకంతో విడుదలైన ఉత్తర్వులో రిజర్వేషన్లు అమలులోనికి వచ్చాయి.. ఆ విధానాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు- కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. పార్లమెంట్లో రెండింట మూడు వంతుల మెజారిటీతో ప్రత్యేక తీర్మానం ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆ తీర్మానం ఒక్క రాష్ట్రం కోసం చేయడానికి లేదు: మొత్తం దేశానికి వర్తించే విధంగా మాత్రమే సవరణ జరగాలి. ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు, తాను చెప్పేది ఆచరణ కాదనీ తెలుసు…కానీ రాజకీయంగా తాను ఒక మెట్టు ఎక్కటానికి నిత్యం సమాజంలో ఏదో ఒక చిచ్చుని రగులుస్తూనే ఉంటాడు చంద్రబాబు. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ , ఇప్పుడు మహాసేన రాజేష్ రిజర్వేషన్లు అక్కరలేదనే భావజలం .. ఇలాంటి ప్రమాధమైన వ్యక్తులతో సాన్నిహిత్యం అంత మంచి కాదని టీడీపీ సీనియర్లు చెబుతున్నా కూడా ప్రస్తుతం చంద్రబాబు వినిపించుకునే పరిస్థితుల్లో లేడని తెలుస్తుంది. ఎస్సీల్లో ఎవరు మాత్రం పుట్టాలని కోరుకుంటారని సిగ్గువదిలి బహిరంగoగా మాట్లాడిన చంద్రబాబు తన రాజకీయం కోసం దళితులతో కూడా ఎలాంటి రాజకీయం చేయగలడో చెప్పటానికి ఇది ఒక నిదర్శనం.