తొందరపడిన టీడీపీ కోయిల ముందే కూసింది.. అందుకే పూర్తి స్థాయి మేనిఫెస్టోని రూపొందించక ముందే మహానాడు సభ ఫెయిల్ కాకుండా ఉండటం కోసం మహానాడులో మేనిఫెస్టో అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించటం కోసం 2023, మే లో మినిమేనిఫెస్టో ప్రకటించింది. అంత ముందే ప్రకటించారంటే ప్రజల గురించి ఎంత ఆలోచనో అనుకుంటే అది పొరపాటే.. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడ పోటీ చేసే అన్ని పార్టీల హామీలలో ఒక్కోటి లేపేసి కలిపి ప్రజల మీదకు వదలడం టీడీపీ సాంప్రదాయం.
ఈ చిత్రవిచిత్ర పోరాటంలో దీపం పథకం అంటూ రాష్ట్ర అక్కచెల్లెమ్మలను మోసం చెయ్యడానికి ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామంటూ మేనిఫెస్టోలో పెట్టారు. టీడీపీ పార్టీకి ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువన్నట్టు ఇచ్చే హామీలు కోటలు దాటుతాయే.. కానీ అమలయ్యేవి మాత్రం శూన్యం. అసలు చంద్రబాబు కు హామీలు అమలు చెయ్యడం.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మహా బద్ధకం.
2014 లో టీడీపీ మేనిఫెస్టోలో గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ.. ఒక్కో సిలిండర్ కి రూ.100 ల చొప్పున ఏడాదికి 12 సెలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.1200 లు సబ్సిడీ ఇస్తామని చెప్పింది చంద్రబాబే.. మరి ఆ హామీని 2014 నుండి 2019 వరకు ఒక్క సారి అంటే ఒక్కసారి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. 2014 లో అధికారంలోకి వచ్చాక ఒక్క సిలిండర్ బండకి ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది.. 2014 లో నెరవేర్చని హామీ 2024 లో ఎలా నెరవేర్చుతామని చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారు. అంటే హామీ ఇవ్వడమే కానీ ఎలానూ అమలు చెయ్యములే అనే ధీమానా.. 2014 లో అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీ వారి మేనిఫెస్టోని ఎక్కడా కనపడకుండా చేసింది. వారి మేనిఫెస్టో చూసి ప్రజలు ప్రశ్నిస్తారనే భయం..
2019 లో ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ జరిగింది. కానీ ఈ కోతల చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 3 న అసలు అమలే చెయ్యని హామీకి కొత్త మెరుగులు దిద్దాడు.. 2 పండగలకు 2 సిలీండర్లు ఫ్రీ అంట.. వీలైతే అన్ని పండగలకూ సిలీండర్లు ఫ్రీ గా ఇచ్చే ఆలోచన చేస్తానంటూ వరాల వర్షం కురిపించాడు. అసలుకు దిక్కులేదు కానీ కొసరు ఇద్దామనుకున్నారట..
ఇలా ప్రతి ఎన్నికలకు సిలెండర్ ఫ్రీ అని సబ్సిడీతో ఇస్తానని బాబు చెప్పే అల్ ఫ్రీ కబుర్లు విని విని విసిగి వేసారిన మహిళలు 2019 ఎన్నికల్లో మూకుమ్మడిగా ఓడించారు. అయినా బుద్ధి తెచ్చుకోని, పద్దతి మార్చుకోని బాబు మళ్ళీ అదే తుప్పు పట్టిన సిలెండరు హామీకి మెరుగులు దిద్దడం చూస్తుంటే ఈ జన్మకి ఇతను మారడు అనిపించక మానదు