2014లో నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, విజయనగరం జిల్లాకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసాడు. కనీసం ఒక్క హామీ కూడా నేరవేర్చలేకపోయాడు. గతంలో చంద్రబాబు విజయనగరం జిల్లా కి ఇచ్చిన హామీలను పరిశీలిస్తే..
– గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం
– పారిశ్రామిక నగరం
– ఏడాది కాలంలో తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయడం
– ఫుడ్‌పార్క్
– గిరిజన యూనివర్సిటీ
– విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడం
– ఎలక్ట్రానిక్ మరియు హార్డ్‌వేర్ పార్క్
– పోర్టు
– సంగీతం మరియు లలిత కళల అకాడమీ ఏర్పాటు
– మెడికల్ కాలేజీ
విజయనగరం జిల్లాకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు తీసుకొని వస్తానని చెప్పిన బాబు, ఎన్నికలకి రెండు నెలల ముందు శంకుస్థాపన చేసి శిలాఫలకంతో సరిపెట్టేశాడు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి కేంద్రం నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే కేవలం శిలాఫలకం మాత్రమే వేసినా ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేది. కానీ వాస్తవానికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకువడానికి 4సంవత్సరాలు పట్టింది. 2023 మే నెలలో ఎయిర్‌పోర్టు పనులు మొదలుపెట్టారు. 2025 జూన్ కి మొదటి ఫేజ్ పనులు పూర్తి చేసికొని ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం సిద్దం అవుతోంది.
పారిశ్రామిక నగరం నిర్మిస్తా అని అన్ని జిల్లాలకు చెప్పినట్లుగానే విజయనగరం జిల్లాకు కూడా హామీ ఇచ్చిన బాబు ఆ దిశగా ముందడుగు వేయలేదు. తోటపల్లి రిజర్వాయర్ కూడా అంతే .. 2003 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతులు తీసుకోకుండానే శంకుస్థాపన చేశాడు. 2004 లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత జలయజ్ఞం ద్వారా తోటపల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో, ఆయన అకాల మరణంతో ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగలేదు. తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 95 శాతం పనులు పూర్తి చేసింది. 2014 విభజన ఆంధ్రప్రదేశ్ కి జరిగిన ఎన్నికలలో గెలిచి రాష్ట్రానికి సిఎం అయినా చంద్రబాబు మిగిలిన అయిదు శాతం పనులు పూర్తి చేయడానికి ఒకటిన్నర ఏడాది సమయం తీసుకొని ప్రారంభించాడు. కానీ రిజర్వాయర్ కు ఎటువంటి కెనాల్స్ అభివృద్ధి చేయకుండానే కాలం గడిపేశాడు.
ఫుడ్ పార్క్ హామీ గాలిలో కలిసిపోయింది. గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు. విజయనగరం జిల్లాకు చెందిన అశోక గజపతి రాజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉండి కూడా కనీసం విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే ప్రపోజల్ పంపలేదు. కనీసం విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చే ప్రయత్నం కనీసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఎలక్ట్రానిక్ & హార్డ్‌వేర్ పార్క్ హామీకి ఎగనామం పెట్టాడు. పోర్టు హామీ వరకే పరిమితం కాగా , సంగీతం & లలిత కళల అకాడమీ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయలేదు. అధికారంలో ఉన్న సమయంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్కూడా కట్టే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక విజయనగరం జిల్లాకి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం, పనులు పూర్తి చేసుకొని ప్రారంభం కూడా జరిగిపోయింది. ఇలా నెరవేర్చని హామీలను ఒక్కో జిల్లాకు ఇవ్వడం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.