రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పార్టీలో టికెట్ ఆశావాహులందరు తమకి చంద్రబాబు టికెట్ ఎప్పుడు ప్రకటిస్తారో అని ఎదురుచూస్తున్న తరుణంలో వారికి సరికొత్త షాక్ ఇస్తున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పాలనా విధానాల వలన టీడీపీ పార్టీ అత్యంత ఘోర ఓటమిని చూసినా పార్టీమీద అభిమానంతో 5ఏళ్ళు నియోజకవర్గంలో పనిచేస్తూ తమ సమయాన్ని, ధనాన్ని వెచ్చించిన నాయకులకు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చెమటలు పడుతున్నాయి.
చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఎన్నికలు చూసినా కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తాడన్న విషయం తెలిసిందే .. తొలుత నీదే టికెట్ అని ఆశావహులని ఎగతోసి నియోజకవర్గాల్లో పని చేయించుకుని చివరికి సర్వేలంటూ, సమీకరణాలంటూ రకరకాల కొర్రీలు పెట్టి వారికి టికెట్ ఇవ్వకుండా ఎన్నికల్లో డబ్బుని కుమ్మరించినవారికే టికెట్ ఇవ్వడం అనేది చంద్రబాబు అధ్యక్షతన టీడీపీలో అనాదిగా వస్తున్న ఆచారం.
ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో కూడా నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పనిచేసిన అభ్యర్ధులు కాకుండా డబ్బుని ముట్టచెప్పిన వారికే టికెట్ ప్రకటించే ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. దానిపేరే ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) సర్వే. ఈ ఐవీఆర్ఎస్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ఏ అభ్యర్ధిని కోరుకుంటున్నారో సర్వే చెయించి చివరికి చంద్రబాబుకి టికెట్ కోసం డబ్బుని ముట్టచెప్పిన వారినే టీడీపీ క్యాడర్ కూడా కోరుకుంటున్నారని చూపుతూ పనిచేసిన నాయకులకి టికెట్లు నిరాకరిస్తున్న వైనం ఇప్పుడు టీడీపీలో చర్చనీయంశంగా మారింది.
చంద్రబాబుని నమ్మితే మోసపోయినట్టే అని తెలిసినా పార్టీమీద అభిమానంతో పనిచేసిన తమకి డబ్బులేదనే కారణంతో ఐవీఆర్ఎస్ పేరుతో ఇలా టికెట్ ఇవ్వకుండా తమ సమయాన్ని డబ్బుని ఖర్చు చేయించి తమని పూర్తిగా దివాళా తీయించి ఇప్పుడు డబ్బులున్న వారికి టికెట్లు అమ్ముకోవడం పూర్తిగా వెన్నుపోటు పొడవడమే అని ఆఫ్-ద-రికార్డ్ గా ఒక టీడీపీ నాయకుడు వాపోవడం గమనార్హం.