‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత సామాజికవర్గాన్ని పట్టించుకోడు. ఆయనకు అందరూ కావాలి’ ఎల్లో మీడియా ప్రచారం ఇది. కానీ వాస్తవం వేరు. కోటరీలో కమ్మ నాయకులే ఉంటారు. దోపిడీ చేసిన సొమ్ముకు బినామీలు వాళ్లే. బాబు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించేది, మంత్రి పదవులు అనుభవించేది కూడా వాళ్లే. 2024 ఎన్నికల నేపథ్యంలో నారా వారు శనివారం 94 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. అందులో సొంత సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కమ్మలకు అత్యధికంగా 21 స్థానాల్లో అవకాశం కల్పించారు. మరికొన్ని చోట్ల ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తుండగా.. ఇక తన సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు (విశాఖపట్నం తూర్పు), వేగుళ్ల జోగేశ్వర్రావు (మండపేట), ఆరుమిల్లి రాధాకృష్ణ (తణుకు), యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం), వెనిగండ్ల రాము (గుడివాడ), గద్దె రామ్మోహన్రావు (విజయవాడ ఈస్ట్), నారా లోకేశ్ (మంగళగిరి), ధూళిపాళ్ల నరేంద్ర (పొన్నూరు), ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), జీవీ ఆంజనేయులు (వినుకొండ), ఏలూరి సాంబశివరావు (పరుచూరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), దామచర్ల జనార్దన్రావు (ఒంగోలు), కాకర్ల సురేష్ (ఉదయగిరి), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ), అమిలినేని సురేంద్రబాబు (కల్యాణదుర్గం), పరిటాల సునీత (రాప్తాడు), నందమూరి బాలకృష్ణ (హిందూపురం), గాలి భానుప్రకాష్ (నగరి), గురజాల జగన్మోహన్ (చిత్తూరు)కు అవకాశం ఇచ్చారు.
ఇంకా సీట్లు కావాలని కమ్మ నేతల నుంచి డిమాండ్లు అధికమయ్యాయి. దీంతో వాటికి బాబు తలొగ్గారు. ఈ నేపథ్యంలో మిగిలిన 57 స్థానాల్లో 10 నుంచి 15 సీట్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. టికెట్లు రాలేదని అలిగిన కమ్మ నేతలను మరోచోట అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న మిగిలిన సామాజిక వర్గాల నేతల్ని ఏదో ఒక కారణం చెప్పి తరిమేయడమో.. లేక బుజ్జగించడమో చేస్తున్నారు. వారు బలి కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఎల్లో మీడియా ఆయనపై బురద వేస్తోంది. వారు సృష్టించినట్లు నారా వారు అందరి వాడు కాదు. ఆయన కేవలం కొందరు పెత్తందారీ కమ్మ నేతల కోసమే పనిచేసే వ్యక్తి.