ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రా.. కదలి రా పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చిన చంద్రబాబు తీరును చూసి ఆశ్చర్యపోవడం ప్రజల వంతయింది . జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని వెర్రికూతలు కూసిన చంద్రబాబు అండ్ కోకు అంతకు రెట్టింపు స్థాయిలో అన్నీ ఫ్రీగా ఇస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల ఏపీ సింగపూర్ అవుతుందా అనుకుంటూ చంద్రబాబు ధాటికి సభ నుండి ప్రజలంతా పరుగులు తీశారు.
అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల చొప్పున ఇచ్చి చదివిస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు అప్పట్లో నేనే ఎక్కువమంది పిల్లలని కనొద్దని ప్రజలను కంట్రోల్ చేశాను కానీ నేను ఇవ్వబోతున్న 15వేల కోసం ముగ్గురు పిల్లలను కనమని సలహా ఇచ్చారు. 15 వేల కోసం పిల్లల్ని కనమని చెప్తున్న చంద్రబాబు తీరును చూసి అవాక్కవడం అక్కడున్న మహిళల వంతయింది. మూడు సిలిండర్లు ఫ్రీ గా ఇస్తాను, మహిళలకు బస్ ప్రయాణం ఉచితం, మందుబాబులకు మంచి రోజులొస్తున్నాయ్ అంటూ ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు మాటలను భరించలేక ప్రజలు గుంపులుగా సభనుండి తిరుగుముఖం పట్టారు. దాంతో సభలో ఎక్కడిక్కడ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.