రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అందరికంటే ముందే తాను అధికారంలోకి వస్తే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో అంటూ చంద్రబాబు 6 ప్రధాన హామీలను ఇచ్చారు ..
అవి ఏంటంటే
1) పేదలను ధనవంతులు చేయడం: రాజకీయాల్లో ఇదొక పడికట్టు పదం. 14 ఏళ్ళు అధికారమిస్తే చేయని వాడు, అయిదేళ్లలో చేయగలడా ?
2) బీసీలకు రక్షణ చట్టం: బీసీల తోకలు కత్తిరిస్తా , బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నది ఈయనే.
3) ఇంటింటికీ నీరు: 2014 లో ఇంటింటికి సురక్షిత నీరు ఇస్తా అని అధికారంలోకి వచ్చాక డబ్బున్న వారు మా మామ పేరు మీద వాటర్ ప్లాంట్స్ పెట్టి నీళ్ళివ్వమన్న ఘనుడు మన బాబు . ప్రస్తుతం ఇంటింటికి త్రాగునీరు ఇవ్వటానికి జల్ జీవన్ మిషన్ పేరుతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2019లో ప్రాజెక్ట్ మొదలెట్టి 76% ఏపీ గ్రామాల్లో పూర్తయింది. ఇక చంద్రబాబు వచ్చి కొత్తగా చేసేది ఏంటో మరి?
3) అన్నదాత : రైతు రుణమాఫీ పేరుతో మోసం చేసింది ఈయనే
4) మహిళ ‘మహా’ శక్తి : డ్వాక్రా రుణమాఫీ , బంగారు నగలు బ్యాంకు నుండి విడిపిస్తాం, ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తాం అంటూ మహిళలని మోసం చేసింది ఈయనే.
5) యువగళం : ఇంటికో ఉద్యోగం , నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసింది ఈయనే
ఇవే కాదు ఆయన రాజకీయ ప్రస్థానంలో చెప్పిన హామీలు చెప్పినట్టుగా నెరవేర్చిన చరిత్ర ఉందా? ఒక సారి చూద్దాం.
1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు వచ్చీ రాగానే ప్రపంచ బ్యాంక్ ను సాకుగా చూపుతూ రామారావు ఇచ్చిన 1994 మానిఫెస్టొలో ప్రధాన హామీలైన
-> రెండు రూపాయల కిలో బియ్యం
-> సంపూర్ణ మద్యపాన నిషేదం
-> 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ లాంటి హామీలు
మొత్తం ఎత్తేసి ప్రపంచబ్యాంక్ జీతగాడిలా మారిపోయి ప్రజల నడ్డి విరిచాడు.
___
ఇక 1999 ఎన్నికలు వచ్చేసరికి కార్గిల్ విజయంతో ఊపు మీదున్న బీజేపీతో పొత్తులోకి వెళ్ళి మళ్ళీ కొత్త హామీలతో ప్రజల ముందుకు వచ్చాడు.
-> కోటి ఉద్యోగాలు
-> ఇంటికో కలర్ టీవీ
-> 100 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
-> సంవత్సరానికి 7 లక్షల ఇళ్ళు
తీరా గెలిచాక ఈ హామీలలో ఒక్కటి కూడా నేరవెర్చలేదు.
__
2 సార్లు మోసపోయిన ప్రజలు 2004 లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మకుండా వైయస్సార్ గారికి పట్టం కట్టారు , మళ్ళీ ఆయన పాలనతో సంతృప్తి చెందిన ప్రజలు తిరిగి 2009లో కూడా ఆయనకే పగ్గాలు ఇచ్చారు .
ఎన్నికల మ్యానిఫెస్టోకి ఒక నిబద్ధత తెచ్చిన నేతగా వైయస్సార్ చరిత్రలో నిలిచిపోయారు.
2009లో దురదృష్టవశాత్తు ఆయన దివంగతులవ్వడం, తరువాత రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం, చివరికి ఎన్నికలు పరిపాలన అనుభవంపై జరగడంతో 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కుర్చి ఎక్కారు.
-> సంపూర్ణ రుణమాఫి
-> ఇంటీకొక ఉద్యోగం
-> డ్వాక్రా రుణమాఫి (అసెంబ్లీలోనే మేము చేయలేం అని చెప్పేశారు) లాంటి 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చిన పాపాన పోలేదు. పైగా నేను ఆ హామీలను నేరవేర్చలేను అని సభ పెట్టి మరీ చెప్పుకున్నారు. ఏకంగా ప్రజలకి ఇచ్చిన హామీలు కనపడకూడదని వారి వెబ్ సైట్ నుండి మానిఫెస్టోనే డిలీట్ చేశాడు. ఇది చంద్రబాబు ఎన్నికల హామీల ట్రాక్ రికార్డ్ ..
కానీ జగన్ గారి విషయానికి వస్తే 2019లో ఎన్నికల్లో ఇచ్చిన మానిఫెస్టోని పవిత్ర గ్రంథంలా భావిస్తానని చెప్పిన విధంగానే 99% హామీలను నేరవేర్చి చరిత్ర సృష్టించారు.
ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే 2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ నిర్వహించిన సర్వేలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అత్యధికంగా 78% నేరవేర్చే దేశాలుగా 12 దేశాలను గుర్తించింది. కాని ఇక్కడ జగన్ గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి మ్యానిఫెస్టో కి ఒక వాల్యూ తెచ్చిన నాయకుడిగా దేశంలోనే టాప్ లో నిలిచారు.
ఇది చంద్రబాబు 14ఏళ్ళ పాలన, జగన్ గారి 5ఏళ్ళ పాలనా ట్రాక్ రికార్డ్ .. ఇలా ప్రతి సారి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబు – ఇక మీద ఏ హామి ఇచినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇకపై నిన్ను నమ్మము, నీ పార్టీని నమ్మము, నీ మానిఫెస్టోని నమ్మమని ప్రజలు అంటున్నారు, నీ గ్యారెంటీలకి గ్యారెంటీ ఏంటి బాబూ అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు.