– ఏడో స్థానంలో ఉందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైందని నిద్ర లేచింది మొదలు ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేస్తూనే ఉంటాయి. పత్రికలు, టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూనే ఉంటాయి. దీనిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తూ స్పష్టత ఇస్తుంటుంది. తాజాగా కేంద్రం పార్లమెంట్లో కీలక ప్రకటన చేసింది. అప్పుల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మరోసారి తేల్చేసింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటు తదితర అంశాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు.
రూ.8.34 లక్షల కోట్లకు పైగా అప్పులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ రూ.4.85 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీతోపాటు వృద్ధి రేటు క్షీణించింది. మన రాష్ట్రాన్ని మినహాయిస్తే మిగిలిన చోట్లంతా అదే పరిస్థితి. ఏపీలో మాత్రం 2.1 శాతం వృద్ధి రేటు నమోదైందని మంత్రి ప్రకటించారు. ఆ సమయంలో స్థూల ఉత్పత్తిలో 17.6 శాతం నికర వృద్ధి నమోదైంది. అదే 2022–23లో 14 శాతం ఉండగా తలసరి ఆదాయంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచింది. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులున్నట్లు ప్రకటించారు.
అప్పంతా బాబు హయాంలోనే..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పచ్చ పత్రికలు పది లక్షల కోట్లని కాకి లెక్కలతో కథనాలు రాశాయి. ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. దాని ప్రకారం రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది రూ.2.59 లక్షల కోట్లు. ఇన్నేళ్లలో జగన్ సర్కారు చేసింది రూ.2 లక్షల కోట్లు మాత్రమే. నారా వారి హయాంలో 22 శాతం ఉంటే.. నేడు 12 శాతం మాత్రమే ఉంది. రెవెన్యూ రాబడి గతం కంటే చాలా పెరిగింది. అప్పుడు ఆరు శాతమైతే నేడు 16.7 శాతంగా ఉంది. దీనిని బట్టి పచ్చ గ్యాంగ్ చేసేదంతా దుష్ప్రచారమే అని తేలిపోయింది.
జగన్ ఆదుకోవడం వల్లే..
వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. దీంతో కోవిడ్ సమయంలోనూ కొనుగోలు శక్తి క్షీణించలేదు. చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు. బహిరంగంగా కనిపించే గణాంకాలే. అయితే జగన్ ప్రభుత్వంపై నిత్యం అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటు. మొన్నటి వరకు పథకాల వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందని ఆస్థాన మీడియాలో ఊదరగొట్టించారు. నేడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నేను పథకాలు ఇస్తానంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోసాలు చేస్తూ బతికే వ్యక్తి మాటలకు ఎప్పుడూ విలువ ఉండదు. ఈ విషయాన్ని బాబు గ్రహిస్తే మంచిది.