విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్ దారి మళ్ళిందని.. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడిన కారణంగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో రాంగ్రూట్లో వెళ్తున్నట్టు గుర్తించి.. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్ వెనుదిరిగిందని.. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించిందని తెలుస్తుంది.. ఇలా చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం అని వార్త కొద్ది క్షణాల్లోనే దావానంలా వ్యాపించింది..
అయితే ఇదంతా నిజంగా సాంకేతిక లోపం వల్లనే జరిగిందా.. లేక చంద్రబాబు ఆదేశానుసారం హెలికాఫ్టర్ రూటు మళ్ళిందా అనేది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది.. చంద్రబాబు కు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే ఇలాంటి ఏదో ఒక పెను ప్రమాదం ముంచుకు రావడం.. తరువాత అది తృటిలో తప్పిపోయి ప్రజల దీవెనలతో ఆయన భయటపడుతుండటం లాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అదేంటో మరి ఇంతకుముందు కూడా 2004లో ఎన్నికలు రాబోతుండగా.. 2003 లో అలిపిరిలో ఆయనపై బాంబ్ బ్లాస్ట్ జరిగింది.. కానీ ఆ కేసులో నిందితులు ఎవరో ఇప్పటికి తెలియరాలేదు.. కానీ ఆ కేసు విచారణలో ఇప్పటికే చాలా మంది నిర్ధోషులుగా భయటపడుతూనే ఉన్నారు..
ఇప్పుడు మే, 2024లో ఎన్నికలు రాబోతుండగా నాలుగు నెలల ముందు ఈ ప్రమాదం..