2014 లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలకు లెక్కలేనన్ని హామీలు గుప్పించాడు. విశాఖకు కూడా క్రింద పేర్కొన్న హామీలనిచ్చి ఆ హామీలను బంగాళాఖాతంలో కలిపేసాడు. ఆ హామీలను ఒక్కసారి పరిశీలిస్తే…
– మెగా సిటీ
– అంతర్జాతీయ విమానాశ్రయము
– వీసీఐసీ పారిశ్రామిక వాడ
– మెట్రో రైల్
– ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
– ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ట్రేడ్
– మెగా ఐటీ హబ్
– ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కేంద్రం
– ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ హబ్
– ఫుడ్ పార్క్
– ఎగ్జిబిషన్ మరియు కన్వెక్షన్ సెంటర్
– గంగవరం ఎల్ఎన్జీ టెర్మినల్
– రైల్వేజోన్
నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత కొత్త రాజధానికి అనువైన చోటు విశాఖపట్టణం కానీ స్వప్రయోజనాల కోసం వేరే చోటికి మార్చారు. విశాఖ పట్టణాన్ని మెగా సిటీని చేస్తా అన్న బాబు, ఆ తర్వాత ఆ హామీ అమలుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు హుదుద్ వచ్చి విశాఖ సిటీని సర్వనాశనం చేసింది. కానీ విశాఖలో రోడ్లు వేసి వదిలేశాడు తప్ప విశాఖను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోడ్లను కూడా కేంద్రం స్మార్ట్ సిటీలో భాగంగా ఇచ్చిన నిధులతో వేసినవే. పర్యాటకంగా పెద్దగా అభివృద్ధి చేసింది కూడా ఏమీ లేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన అయితే చేశాడు కానీ పర్మిషన్స్, పర్యావరణ క్లియరెన్స్ వంటివి ఏమి తీసుకురాలేదు.
2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు అన్ని అనుమతులు తీసుకొని రూ.4592 కోట్ల వ్యయంతో మే 3 2023 శంకుస్థాపన చేసింది. 2025 జూన్ కి మొదటి దశ పనులు పూర్తి చేయాలని సంకల్పించి ఆ దిశగా శరవేగంగా పనులు చేస్తుంది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పి దీని క్రింద వచ్చే పట్టణాలు అన్నిటినీ కారిడార్ లో అభివృద్ధి పరుస్తానని చెప్పిన చంద్రబాబు ఆ దిశగా ముందడుగు వేయలేదు. మెట్రో రైల్ గురించి మాట్లాడడం అనవసరం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కి ఇప్పటికీ శాశ్వత క్యాంపస్ లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 2021 లో కాకినాడలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఐటీ పితామహుడని చెప్పుకునే బాబు మెగా ఐటీ హబ్ తెస్తానని హామీ ఇచ్చి కనీసం పట్టుమని పది కంపనీలు తీసుకురాలేదు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇన్నోవేషన్ & ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటును కేవలం ప్రకటనకే చంద్రబాబు పరిమితం చేసాడు. ఫుడ్ పార్క్ ను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా ఒక జిల్లాకి కూడా చేయలేదు. ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. గంగవరం ఎల్ ఎన్ జీ టెర్మినల్ ప్రయత్నం కూడా చేయలేదు. రైల్వే జోన్ కేంద్రంతో పొత్తులో ఉన్న ఏర్పాటు చేయలేకపోయాడు. విశాఖకు ఇన్ని హామీలు ఇచ్చినట్లే ఇచ్చి ఆ హామీలను బంగాళాఖాతంలో చంద్రబాబు ముంచేశాడు.