2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయఢంకా మ్రోగించేందుకు అధికార వైయస్సార్సీపీ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయంలో పెడార్ధాలు వెతుకుతూ విషం చిమ్ముతున్న ఈనాడు మరోసారి “పెత్తందార్లకే పెత్తనం” అంటూ బురదజల్లింది. ఒక పార్టీకి లబ్ది చేకూరే కథనాలను ప్రచురిస్తూ పాఠకుల మనసుల్లో విష బీజాలు నాటడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు వైయస్సార్సీపీ చేపట్టిన సమన్వయకర్తల మార్పుల్లో దళితులు బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఓ మోసపూరిత కథనాన్ని అచ్చేసింది.
దళితుల ఆత్మబంధువు జగన్
దళితులు బీసీలకు పదవులిచ్చే విషయంలో ఈనాడు పత్రిక బురదజల్లితే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైయస్సార్సీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లుగా కొన్న చంద్రబాబు 2017 లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు. మంత్రి పదవులు లభించిన నలుగురిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిలప్రియా రెడ్డి, సుజయ్ కృష్ణరావు (వెలమ దొర ) ఉన్నారు కానీ బిసీ, ఎస్సి, ఎస్టీ, ముస్లింలకు మాత్రం మంత్రి పదవులు ఇవ్వడానికి బాబుకి మనసు రాలేదు. ఆ సమయంలో మౌనవ్రతంలో ఉన్న డ్రామోజీ ఇప్పుడు మాత్రం జగన్ అన్యాయం చేశాడంటూ కొత్త పాట మొదలుపెట్టాడు.
నిజానికి దళితులకు చంద్రబాబు హయాంలో ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు జగన్ మాత్రం ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి వంటి కీలక శాఖలతో సహా ఐదు మంత్రి పదవులను దళితులకు కేటాయించారు. చంద్రబాబు నాలుగు కార్పొరేషన్ పదవులను దళితులకు ఇస్తే వాటికి సుమారు నాలుగు రెట్లు అంటే 15 కార్పొరేషన్ పదవులను జగన్ దళితులకు ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా శాసన మండలి చైర్మన్ గా మోషెన్ రాజుకు బాధ్యతలు అప్పగించారు.
మే 11 2022 న “గడపకు గడపకు మన ప్రభుత్వం” ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లోమార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే దళితుల స్థానాల్లో మార్పు చేసి వారిని వేరే చోట్లకి మార్చి వైయస్సార్సీపీ టికెట్లు ఇచ్చింది. బీసీ అయిన విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు. అదే విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి), తిప్పల నాగిరెడ్డి (గాజువాక) స్థానాల్లో బీసీలైన గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. ఇలా బీసీలకు టికెట్లు ఇచ్చినా ఇవ్వలేదని అసత్య ప్రచారం చేయడం రామోజీకే చెల్లింది. దాంతో పాటు ఎస్సి నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషపు రాతను ప్రచురించిన ఈనాడుకు బాబు హయాంలో దళితులకు జరిగిన అవమానాలు మాత్రం గుర్తున్నట్లు లేదు.
చంద్రబాబు హయాంలో దళితులపై వివక్ష
దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని మీడియా ముఖంగా వివక్షను వెళ్లగ్రక్కిన బాబు, జగన్,హోమ్ మంత్రి,డిజీపి క్రిస్టియన్స్ అంటూ మత విద్వేష పూరిత వ్యాఖ్యల చేసారు. బోస్టన్ రిపోర్ట్ చదవడానికి వాడెవడు అంటూ దళిత IAS విజయానంద్ ను తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు. తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకున్న టీడీపీ నాయకులు కూడా దళితులపై వివక్ష చూపించడాన్ని ప్రజలు మర్చిపోలేదు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఓ అడుగు ముందుకేసి దళితులు మీకెందుకురా రాజకీయాలు నా కొ…..రా, రాజకీయాలు అంటే మేము చేయాలని ఎన్నికల ప్రచారంలో పెట్రేగిపోతే మరో అడుగు ముందుకేసి టీడీపీ కి చెందిన కొమ్మినేని చౌదరీస్ దళితురాలైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వినాయక విగ్రహానికి పూజ చేయడానికి వెళితే మలినం అవుతుంది అంటూ ఘోరావ్ చేశారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే తమ కులాల పెత్తనం దెబ్బ తింటుంది అని చంద్రబాబు అడ్డుకున్నాడు. ఇలా అడుగడునా వివక్ష చూపిస్తున్న చంద్రబాబు లోపాలను ఎత్తి చూపకుండా దళితులకు, బీసీలకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రి జగన్ పై విషప్రచారం చేస్తున్న ఈనాడు ఉద్దేశ్యాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని రామోజీరావు ఎప్పుడు గ్రహిస్తారో ఆ కాలమే సమాధానం చెబుతుంది.