కాంగ్రెస్ నుండి బయటకి వచ్చాక జగన్ పై నమోదైన కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అలాగే ఇదే అంశంల్ ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఆసక్తికర విషయం ఏంటంటే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించగా ఇందుకు తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా… ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
ప్రజా ప్రతినిధుల పై దాఖలైన పిటిషన్లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కేసులలో విచారణ త్వరగా ముగించాలని జగన్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గా ప్రస్తావించారు.
మా కేసులు త్వరగా విచారణ ముగించమని జగన్ గారి తరుపున లాయర్లు అడుగుతుంటే ఆలస్యానికి మాకు సంభంధం లేదని సీబీఐ చెప్పడం చూస్తే కేసులోని డొల్లతనం బయటపడుతుంది.