వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి కీలక అధరాలు లభించినట్లు తెలుస్తుంది. వివేకానంద రెడ్డి రాసి ఇచ్చిన వీలునామా సీబీఐకి లభించింది. ఈ వీలునామా ప్రకారం వివేకా రెండో భార్య షేక్ షమీమ్ కి ఆస్తి వెళ్తోందనే కుట్రతోనే హత్య జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా వివేకా రాసిన లెటర్ దాచిపెట్టమని చెప్పిన వివేకా అల్లుడు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన కీలక ఆధారాలను సీబీఐ సేకరించినట్లు సమాచారం. వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ కాల్స్ ఆధారంగా సీబీఐ దర్యాప్తు ముమ్మురం చేసింది. త్వరలోనే వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇటీవల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై అభాండాలు వేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సునీత భర్త వైపు కేసు తిరగడం అనూహ్య పరిణామమనే చెప్పొచ్చు.