శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు (కదిరి) వజ్ర భాస్కర్ రెడ్డి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. భాస్కర్ రెడ్డి సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. వజ్ర ఫౌండేషన్ స్థాపించి ఎందరికో కంటి ఆపరేషన్స్ చేయించడంతో పాటు పేదలకు ఒక్క రూపాయికే భోజనం పెట్టి ప్రజలకు చేరువయ్యారు.
కాగా గతంలో వైఎస్సార్సీపీలోనే ఉన్న భాస్కర్ రెడ్డి పార్టీ టికెట్ నిరాకరించడంతో భంగపడ్డారు. దాంతో వైసీపీని వీడి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఆరునెలల్లోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తిరిగి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం గమనార్హం.