ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కూటమి కట్టి మళ్ళీ తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్దమయ్యారు పవన్. అయితే ఈ సారి గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు కాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయనే కారణంతోనే పవన్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారనే వాదన ఉన్నప్పటికి అక్కడ బీసీలు సైతం బలంగానే ఉన్నరు.
అధికార వైసీపీ తరుపున సీనియర్ లీడరైన వంగా గీత గారు పవన్ కి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలుపు అవకాశాలు కూడా ఆమెకే అధికంగా ఉన్నాయనే వాదన వినిపిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రజల అందరి ఫోకస్ ఇప్పుడు పిఠాపురంపై పడింది. అయితే పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్న ఈ చోట నుంచే బరిలోకి మరో పార్టీ కూడా నామినేషన్ వేసింది.
2019 ఎన్నికల్లో పుంగనూరు నుండి జనసేన తరుపున బరిలో ఉన్న రామాచంద్ర యాదవ్ ఇటీవలే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరుపున అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ బిగ్ బాస్ ఫ్రేమ్ తమన్నా సింహాద్రి పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలు లోని భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి పిఠాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఇది ఇలా ఉంటే జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవీ భాధ్యతలు చేపట్టి ఆ తరువాత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక ఆ పార్టీ నుండి దూరమైన శ్రీమతి ఆకుల జయకళ్యాణి తమన్నాకి తోడుగా నామినేషన్ కి రావడం గమనార్హం.