అదేంటో అధికారం లో ఉన్నప్పుడు చేనేత ఆత్మహత్యలు గుర్తు రావు, కుల వృత్తుల గురించి పట్టింపే ఉండదు.. అధికారం పోగానే అందరూ గుర్తొస్తారు.. ఈసారి గెలిపిస్తే దృష్టి మొత్తం మీ మీదే అనడం, తర్వాత షరా మామూలే… తోకలు కత్తిరిస్తా అనడం…
14 ఏళ్లు సీఎం హోదా లో ఉండి చేనేత ఆత్మహత్యలు ఎందుకు ఆపలేకపోయారు అని పాపం భువనేశ్వరి గారు అడిగినట్టు లేరు.. బహుశా గుర్తు రాకపోయి ఉండచ్చు…
పోనీ ఒకసారి గుర్తు చేయమంటారా?
2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 600 హామీల్లో కులానికో పది చొప్పున చేనేతలకు కూడా ఓ పది హామీలు ఇచ్చారు మన టీడీ పార్టీ వారు…
చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు,
చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తి పన్ను మినహాయింపు,
చేనేత రుణమాఫీ, పవర్లూమ్ లపై ఉన్న రుణాలు రద్దు…
చేనేత కార్మికులకు రూ. వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, ప్రతీ ఏడు బడ్జెట్ లో వెయ్యి కోట్ల కేటాయింపు…
ఇలా అసలు సాద్యసాధ్యాలతో పనే లేకుండా, మనం చేసేవా సచ్చేవా అని డజన్ల కొద్దీ హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చింది లేదు…
ఇక చేనేత రుణమాఫీ విషయానికి వస్తే అతి పెద్ద హాస్యం పండించారు… 2015 లో 125 కోట్ల రూపాయల రుణమాఫీ ప్రకటించి, 2.80 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నాం అని ప్రకటించారు…
అంటే ఒక్కొక్కరికి సరసరిగా 4 వేలు రుణమాఫీ ప్రకటన చేసారు… వాస్తవానికి ఆ 135 కోట్లు కూడా మాఫీ చేసింది లేదు… పది పవర్లూం లు పెట్టుకుని ఒక మధ్య తరహా పరిశ్రమ నడుపుతున్న కొంత మందికే ఆ రుణమాఫీ జరిగింది కానీ చిన్నా చితకా చేనేత కార్మికుడికి రూపాయి లబ్ధి చేకూరింది లేదు…
ఇలా ఎన్నికల సమయం లో హామీలు ఇవ్వడం, తర్వాత గాలికి వదిలెయ్యడం పరిపాటి అయింది…భువనేశ్వరి గారూ, ఒకసారి చంద్ర బాబు గారిని 2014 మేనిఫెస్టో లో చేనేత లకి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని అడగకూడదూ?