ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ జనసేన మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ తరుపున టీడీపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు , దీనికి లోకల్ జనసేన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు అయితే ఈ ప్రచారంలో ఎక్కడ జనసేన జెండాలు లేదా పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు, ప్రచార రథానికి ఒక్క టీడీపీ జెండాలు మాత్రమే కట్టి జనసేన జెండాలను కట్టలేదు. అంతే కాకుండా ప్రచార రథం మీద జనసేన పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వలేదు. కింద అందరితో పాటు టీడీపీ జెండాలు పట్టుకుని నడుచుకుంటూ రమ్మని చెప్పారు. ఇంత అవమానం భరించలేక జనసేన నేతలు టీడీపీ ప్రచార రథం బలవంతంగా ఎక్కి జనసేన జెండాలు పట్టుకుని పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు. దీనితో ఒక్కసారిగా టీడీపీ నాయకులు జనసేన వారిని ప్రచార రథం మీద నుండి కిందకు దిగిపొమ్మని ఆదేశించారు అయిన జనసేన వారు దిగకపోయే సరికి వారిని మెడపట్టి కిందకు దించారు అంతటితో ఆగకుండా కొంత మందిని చొక్కాలు పట్టుకొని లాగి కిందకు విసిరేసారు. అలాగే జెండాలను విసిరికొట్టి మీ అంతు చూస్తామని అన్నారు.
దీనితో జనసేన కార్యకర్తలు అక్కడే తమ నిరసనలు తెలిపి ఇలా పిలిచి అవమానించడం బాగాలేదు, మా నాయకులను చొక్కాలు చింపి, మెడ పట్టుకొని కిందకు విసిరెయ్యడం ఎంత వరకు సమంజసం. మీరు మా ఆత్మాభిమానం మీద కొట్టారు భీమిలీ లో టీడీపీ ఎలా గెలుస్తాదో చూస్తాం అంటూ జనసేన పార్టీ తరపున సవాల్ విసిరారు.
ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ తన ప్రచారంలో ప్రతీ చోట జనసేన నాయకులను కార్యకర్తలను తిడుతూ మీరు చిల్లర రాజకీయాలు చేస్తారు అంటూ రెండు మూడు చోట్లా కర్రలతో దాడి చేసిన సంఘటనలను చూసాము అంతే కాకుండా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కీలక నాయకులు మేము పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం దగ్గరకి పోవాలా అంటూ టీడీపీ తరుపున రెబల్ అభ్యర్థినీ పోటీకి దించిన విషయం అందరికి తెలిసిందే. ఇలా దాదాపు ముప్ఫై నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన క్యాడర్ కు మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఇవి ఇలా కొనసాగితే కూటమి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యనిస్తున్నారు, పలువురు విశ్లేషకులు