ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో ఏర్పాటు అవుతున్న బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి సిద్దమైంది. విజయవాడ నగరానికే ప్రధాన ఆకర్షణగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేశారు.
ఈ స్మృతివనంలో విగ్రహం బేస్ కింద భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్ళు ఉంటాయి. ఇందులో ఒక సినిమా హాల్ , మిగిలిన మూడు హాళ్ళలో అంబేద్కర్ మహాశయుడి చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది.
ఇక మొదటి ఫ్లోర్ లో నాలుగు హాళ్ళు ఉంటాయి. ఒక హాలులో అంబేద్కర్ గారికి దక్షిణ భారత దేశంతో ఉన్న అనుభంధాన్ని ప్రదర్శిస్తారు. వీటితో పాటు ప్రాoగణంలో మ్యుజికల్ వాటార్ ఫౌంటెయిన్ , ఫుడ్ కోర్ట్ , తూర్పు పడమరన ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భారీగా వాహన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారి చేతుల మీదగా ఈ నెల 19న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.