బీసీ నాయకత్వాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ టీడీపీ అంటూ చంద్రబాబు మాట్లాడిన తీరు.. నరంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ.. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసిన బాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ పంచన చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున బీసీ నేతలే పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బీసీల జనాభా అధికం.1989లో కుప్పం నియోజక వర్గానికి బాబు వలస వెళ్లి రాజకీయంగా బీసీలకు ద్రోహం చేశారు. అప్పటి నుంచి కుప్పంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. తండ్రి బాటలోనే నడుస్తూ మంగళగిరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో నారా లోకేశ్ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని సీఎం వైఎస్ జగన్ ప్రతిసారి చెబుతూ వచ్చారు. చెప్పడమే కాకుండా వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నుముకగా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చెప్పిన సీఎం జగన్ బీసీలకు ప్రతినిత్యం మంచి చేస్తూనే వస్తున్నారు.
బీసీల రక్తం సీఎం జగన్ పీలుస్తున్నారని మాట్లాడుతున్న బాబు.. వివిధ సంక్షేమ పథకాలతో గత 56 నెలల్లో వైసీపీ ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి పేదలకు రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరగా అందులో బీసీ వర్గాలే రూ.1,65,476.89 కోట్ల మేర లబ్ధి పొందాయని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
2014–19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ప్రస్థుతం 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు స్థానం కల్పించారు సీఎం వైఎస్ జగన్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే నలుగురు బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో చైర్మన్ పదవులు.. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో అధిక ప్రాధాన్యత బీసీలకే కల్పించారు సీఎం జగన్. ఇదంతా వైసీపీ రాజకీయమైతే.. ఇక టీడీపీలో కుల రాజకీయాలు అధికం.. అంటే కులాల ప్రతిపదికన జరిగే రాజకీయ సమీకరణాలుంటాయని కాదు..