2018 లో బిజెపితో పొత్తు నుండి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ పై అనేక వ్యక్తిగత విమర్శలు చేసాడు చంద్రబాబు .
గాంధీలా బ్రతుకుతున్న తనని విమర్శించే అర్హత మోడీకి లేదని, అద్వానికి ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేదని ఒకరోజు విమర్శించాడు . మరిప్పుడు ఆ సంస్కారం లేని వ్యక్తితో పొత్తుకి ఎందుకు పాకులాడుతున్నాడో .
మోదీ ఈయన మీద ఏదో పగ పెంచుకున్నట్టు నేను కనిపిస్తే మోడీ కొడతారేమో అన్నాడు , అంతటితో ఆగలేదు ఆయనకి ఎన్నికల మీద ఆసక్తి తప్ప దేశ భక్తి లేదన్నాడు. మరిప్పుడు పొత్తు కోసం పోతే కొట్టనని మాటిచ్చాడా మోడీ.
పొత్తులో ఉండగా హోదా వద్దు ప్యాకేజి ముద్దు అని అసెంబ్లీలో తీర్మాణం చేసి పొత్తు విడిపోయాక హోదా విషయంలో ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకే ఈ గడ్డకు రావాలి అని మాట్లాడారు. ఇప్పుడు పొత్తు పెట్టుకొంటే హోదా ఇస్తానన్నాడా మోడీ.
ఇంకో సందర్భంలో బీజేపీ పార్టీకి సహకరించే వాళ్ళు దేశ ద్రోహులని వాఖ్యానించిన బాబు ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకోవడం అంటే టీడీపీని కూడా దేశద్రోహనికి సిద్ధం చేస్తున్నాడా
అధికారంకోసం మోదీ గోద్రాలో 2 వేల మందిని చంపేశారు, దేశాన్ని తాకట్టు పెట్టె మనస్తత్వం మోదీది అని విమర్శించిన బాబు ఈరోజు అలాంటి హంతకుడితో, దేశాన్ని తాకట్టు పెట్టే వ్యక్తితో పొత్తు కోసం తాపత్రయ పడటం చూస్తే ఆయన దేశాన్ని తాకట్టు పెడితే ఈయన రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడేమో
బీజేపీకి ఓటేస్తే జగన్ కి ఓటేసినట్టే అని గతం లో చెప్పిన బాబు ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకొంటే జగన్ తో పొత్తు పెట్టుకొన్నట్టు కాదా
2014 లో రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారని కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తే కత్తులు కొడవళ్ళతో చంపేయాలని మాట్లాడాడు , 2018 లో బీజేపీతో విభేదించి మళ్ళీ దేశం కోసం స్నేహమంటూ అదే కాంగ్రెస్ తో జతకట్టి రాహుల్ గాంధీకి ఓ ఫిడేల్ బహుకరించాడు. ఇప్పుడు రాహుల్ ఆ ఫిడేల్ ని ఏమి చేయాలి .
ప్రజారాజ్యం టైం లో చిరంజీవి కూడా ఎన్నికలల్లో ఒంటరిగా వెళ్లే దమ్ము ఉందా అని చంద్రబాబు కి సవాలు విసిరాడు. చివరికి చిరంజీవి తమ్ముడితో కూడా పొత్తు పెట్టుకొని తనకి ఒంటరిగా ఎన్నికలకు పోయే దమ్ము లేదని నిరూపించుకొన్నాడు బాబు .
మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కోసం మంటూ బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యాడు, ఇవన్నీ చూస్తే చంద్రబాబు ఏ పార్టీతో అయినా పొత్తుకు వెళ్తున్నాడు, ఏ పార్టీతో అయినా తెగతెంపులు చేసుకొంటున్నాడు అంటే అది అయన స్వప్రయోజనాలు కోసమే తప్ప రాష్ట్రము కోసం కాదనేది తెలుస్తుంది, అట్లుంటాది మన బాబుతోనీ.