ఇటీవల కాలంలో మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మాట్లాడుతున్న చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర మందుబాబులకు వరాల జల్లు కురుపిస్తున్నాడు..” నేనొస్తే నాణ్యమైన మద్యం అందిస్తా, సరసమైన ధరలకు మంచి బ్రాండ్లు అందిస్తా.. రోజూ నైట్ రెండు పెగ్గులేస్తే తప్పేంటి.. “ అంటూ టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం పాలసీ, చవక ధరలకు నాణ్యమైన బ్రాండ్స్ హామీలిస్తున్నాడు. నిజానికి అలా మద్యం రాష్ట్రంలో విచ్చలివిడిగా దొరికితే చంద్రబాబుది ఏం పోదు.. మన ఇళ్ళు ఒళ్ళులే గుల్ల అవుతాయి. అధికారంలోకి రావడానికి చంద్రబాబు మంచి మందు బ్రాండ్లు తెస్తాననైనా లేక ఇంకేమైనా చెబుతాడు. కానీ ఓట్లు వేసే ప్రజలకు విచక్షణ ఉండాలి.
వాస్తవానికి టీడీపీ అధినేత ఎన్టీఆర్ గారి నినాదం మద్యపాన నిషేధమే.. ఆ తరువాత ఆయనను ముంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా మద్యనిషేధాన్నే పాటిస్తా అని కూడా చెప్పాడు ఆ రోజుల్లో. సంపూర్ణ మద్యనిషేధాన్ని పాటించడంతో “ పగిలిన మద్యం సీసాలు.. పెరిగిన సిరిసంపదలు “ అంటూ వార్తాపత్రికలలో కథనాలు ప్రచురించారు. నాడు మద్యనిషేధానికి అంతగా మొగ్గుచూపిన చంద్రబాబు నేడు మద్యం తాగితే తప్పేంటి అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు తప్పైంది.. ఇప్పుడెలా ఒప్పవుతుంది. చంద్రబాబు అధికారంలోకి రావడానికి నాలుక ఎటైనా తిప్పేస్తాడు. ముందు ఎన్టీఆర్ అడుగుజాడల్లో మద్యనిషేధమంటూ ప్రజలను మభ్యపెట్టి.. తరువాత మెల్లగా మద్యనిషేధాన్ని ఎత్తివేశాడు. అప్పటి నుండి ప్రజలను మత్తుకు బానిస చేశాడు.వాస్తవానికి ప్రస్థుతం ఆంధ్రాలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చిందే చంద్రబాబు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు.