2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుస ఫిర్యాదుల ఆధారంగా కీలక అధికారులపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విధులు కేటాయించొద్దంటూ సి ఎస్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డిజిపి స్థానం నుంచి బదిలీ కావడంతో ఆస్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ ఏర్పడిన ఆస్థానంలో కొత్త అధికారి నియమించడానికి అధికారుల పేర్లను సిఫారస్సు చేయమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ ముగ్గురిలో ఎన్నికల సంఘం ఎవరు సరైన అధికారిగా భావిస్తే వారిని కొత్తగా డీజీపీగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. డిజిపిగా ఎంపికలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముగ్గురు పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపేందుకు ఎంపిక చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లలో ద్వారక తిరుమలరావు, అంజనా సిన్హా , మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నట్లు సమాచారం. ద్వారక తిరుమలరావు, 1989 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్నారు. అంజనా సిన్హా, 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. మాదిరెడ్డి ప్రతాప్, 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ విభాగానికి డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కావడంతో డిజిపి పోస్ట్ ఎవరికి వివరిస్తుందో తెలియాల్సి ఉంది. వీరి ముగ్గురిలో సీనియర్ అయిన ద్వారక తిరుమలరావుకి డీజీపీగా అవకాశం లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.