ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చినన్ని విద్యా సంస్కరణలు ఈ దేశంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు. పిల్లలకు మనమిచ్చే నిజమైన ఆస్థి విద్యే అని నమ్మే దార్శనికుడు సీఎం వైఎస్ జగన్. 56 నెలల పరిపాలనా కాలంలో రూ.73,417 కోట్ల వ్యయంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.
రాష్ట్రంలో NAAC (National Assessment and Accreditation Council) గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు 2019 నాటికి 257 ఉండగా.. 2024 నాటికి 437 గా వృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16, 2024 న ఆన్ లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’ (edX )తో ఒప్పందంతో చేసుకుంటుంది. మన రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+ ఎడెక్స్ ఆన్ లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతోమంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు కల్పించే ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’ (edX )తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తద్వారా ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు.
IB (ఇంటర్నేషనల్ బకలారియేట్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)ల మధ్య ఒప్పందం ఇప్పటికే జరిగింది.. మన విద్యార్థులను IB విధానానికి సన్నద్ధులను చేస్తూ.. గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే ప్రక్రియకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుండే శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనతో CBSE మొదలు IB దాకా ప్రయాణం సాగింది. 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ లో భాగంగా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు విద్యార్థులకు సులభంగా ఇంగ్లీష్ పాఠాలు అర్థమయ్యేలా అందజేస్తున్నారు.
1 నుండి 5 వ తరగతి వరకు ప్రతి స్కూల్ లో ఉండేలా 45,000 స్మార్ట్ టీవీలు.. మూడో తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్.. 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్ కంటెంట్.. 8వ తరగతి విద్యార్థులకు, బోధించే టీచర్లకు బైజూస్ ప్రీ లోడెడ్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు అందజేస్తున్నారు.. 6వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ డిజిటల్ బోధనలో భాగంగా ఇందుకోసం 6 వ తరగతి ఆపైన ప్రతి తరగతి గదిలో ఉండేలా 62 వేల ఐఎఫ్ పీలు ఏర్పాటుచేసి ఆధునిక డిజిటల్ విద్యాబోధనకు ఊతమిస్తుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా 2024 నుండే ప్రతి స్కూల్లో 3వ తరగతి నుండి TOEFL ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి, ట్రైనింగ్ ఇస్తూ, TOEFL జూనియర్, ఇంటర్ లో TOEFL సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి అమెరికన్ సర్టిఫికెట్ అందజేస్తుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ETS తో ఒప్పందం కుదుర్చుకుంది.