వై.యస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన రుణాల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అయిదో స్థానంలో నిలిచింది. రైతులకు చిన్న మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి, వారి సాగుకి అవసరమైన సహాయాన్ని అందించడమే ఈ రుణాలు ఇవ్వడం వెనుక ముఖ్యోద్దేశం.
కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరు చేస్తారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు(KCC) రుణాల్లో దేశంలో రాష్ట్రం ఐదో స్థానంలోనూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలోనూ ఉంది.45.52 లక్షల మంది రైతులకు కేసీసీ కార్డులు ఇవ్వడమే కాక, ఆ కేసీసీ కార్డులపై రూ.60,879 కోట్ల రుణాలు ఇప్పటివరకూ మంజూరు చేసింది. దేశంలో టాప్ 5 రాష్ట్రాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి కేసీసీ ద్వారా రైతులకు అందించిన రుణాలు వివరాలిలా ఉన్నాయి.
అంతే కాకుండా రైతు భరోసా పధకం ద్వారా ప్రతి ఏటా 13500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుండి దిగుబడి వరకూ ప్రతి దశలో అండగా ఉండటమే కాక పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది జగన్ ప్రభుత్వం.