రాష్ట్రంలో పేద , మధ్యతరగతి, మహిళలు, రైతు, కార్మిక ఇలా అన్ని వర్గాలు జగన్ పాలన ద్వారా తమకు పారదర్శకంగా అందిన సంక్షేమ ఫలాలు దృష్ట్యా మళ్ళీ జగన్ కే తమకి మద్దతు అని కుండబద్దలు కొడుతున్న సమయంలో. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం జగన్ కి మద్దతు పలికే అవకాశం లేదని ప్రతిపక్షాలు అంచనా వేస్తూ వచ్చాయి. సిపీఎస్ రద్దు హామీని జగన్ నిలబెట్టుకోలేక పోయారని ఈ ఒక్క కారణంతో ప్రభుత్వ ఉద్యోగులు అందరు జగన్ కి వ్యతిరకంగా ఉన్నారని అదీ కాక తాము జగన్ ప్రభుత్వంపై నిత్యం పనికట్టుకుని చేసిన దుష్ప్రచారాణ్ణి ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముతూ వచ్చారని కాబట్టి జగన్ కి ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు ఇవ్వరని , కూటమికే మద్దతు ఇస్తారని అంచనాలు వేసుకుంటూ వచ్చారు.
అయితే కూటమి సభ్యులు తమ మానిఫెస్టోని విడుదల చేశాక పూర్తిగా సీన్ మారిపోయిందనే ఒక అంచనాకి వస్తున్నారు. తెలుగుదేశం తయారు చేసిన మానిఫెస్టోలో సైతం సీపీఎస్ రద్దుపై స్పష్టత ఇవ్వలేదని జగన్ చేస్తానని తయారు చేసిన జీపీఎస్ విధానాన్నే తాను చేయడానికి ప్రయత్నాలు చేస్తాం అని మానిఫెస్టోలో పెట్టారని దీంతో ఉద్యోగులు సైతం చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితిలో లేరని , తెలుగుదేశం పాలన , వైసీపీ పాలన బేరీజు వేసుకుంటే జగన్ పాలనలోనే తమకి ఎక్కువ మేలు జరిగినట్టు లెక్కలే చెబుతున్నాయని కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు సైతం మానిఫెస్టోల విడుదల తరువాత కూటమికి దూరంగా జరిగారనే అంచనాకి తెలుగుదేశం శ్రేణులే వచ్చినట్టు సమాచారం .
జగన్ 5ఏళ్ల పాలనలో ఉద్యోగుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు ఉద్యోగులకి జీతాలు సక్రమంగా ఇవ్వని సమయంలో సైతం జగన్ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలివ్వడం జరిగందని. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎగ్గొట్టిన రెండు డీఏలను కూడా జగన్ చెల్లించడం జరిగిందని. జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా ముప్పై అయిదు వేల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా తగ్గించారని. దీంతో గతంలో మాదిరి ఉద్యోగులు సమయం దాటి పనిచేయాల్సిన అవసరం 5ఏళ్లలో ఎప్పుడు రాలేదని, జగన్ ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన విదంగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు 27% మధ్యంతర భృతి మంజూరు చేసి 17,918 కోట్లు చెల్లించారని. 11వ వేతన సవరణ అమలు చేసి 11,707 కోట్ల అదనపు వ్యయాన్ని ఈ ప్రభుత్వం భరించిందని, ఉద్యోగ సంఘాలు అడగకుండానే జగన్ వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 12వ పీఆర్సీని ఏర్పాటు చేశారని. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వారి వేతనాలను కూడా పెంచారని. ఇవేకాకుండా జగన్ తన 5ఏళ్ల పాలనలో ఉద్యోగుల బద్రత కోసం అనేక చర్యలు తీసుకున్నారని, గతంలో మరే ముఖ్యమంత్రి చేయని విదంగా ఉద్యోగులకు జగన్ మేలు చేశారని ఆ వర్గాల నుండి వస్తున్న మాట .