ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. విపక్షాలు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో మంత్రి పూర్తి వాస్తవాలు వెల్లడించారు.
13 లక్షల కోట్ల అప్పులు చేశామని చంద్రబాబు ఏ ఆధారంతో చెబుతున్నారు? ఇంకొకరు 10 లక్షల కోట్లంటారు.. మరోసారి ఏడు లక్షల కోట్లంటారు. ఈ లెక్కలు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మాటల్లోనే.. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బంది అయ్యిందన్నది వాస్తవం. కానీ, పెండింగ్ బిల్లులు రూ.1.90 వేల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు?, ఆర్బీఐ విడుదల చేసిన డాక్యుమెంట్లో 15 ఏళ్ల డేటా ఉంటుంది. టీడీపీ హయాంలో వార్షిక అప్పు 22 శాతం ఉంటే.. మా ప్రభుత్వంలో 12 శాతమే ఉంది. ఆర్బీఐ, ఆర్థిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయటం సాధ్యం అవుతుందా? స్థూల ఉత్పత్తిపై టీడీపీ హయాంలో అప్పు 2,59,000 కోట్లు.. అంటే 7 శాతం నిష్పత్తి.. మా ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తిలో 2,26,000 కోట్ల అప్పు.. అంటే నిష్పత్తిలో 5.6 శాతమే. మా ప్రభుత్వ హయాంలో స్థూల ఉత్పత్తి 10,84,000 కోట్లు.. టీడీపీ హయాంలో 6,98,000 కోట్లు.. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు 2018-19లో రూ.44,86,000.. 2022- 23లో పీఎఫ్ ఖాతాలు రూ.60,78,000.. మరి ఉద్యోగాలు పెరిగినట్లా కాదా? రాష్ట్ర విభజన నాటికి అప్పులు 1,53,346 కోట్లు, బాబు దిగిపోయేనాటికి ఆ మొత్తం 4,12,288 కోట్లు అయ్యింది. 2023 మార్చి నాటికి 6,38,217 కోట్లుగా ఉంది. బాబు చేసిన అప్పు 2.60 లక్షల కోట్లు, జగన్ చేసిన అప్పు 2.25 లక్షల కోట్లు. రెవెన్యూ రాబడిలో పెరుగుదల బాబు పాలనలో 6 శాతం, జగన్ పాలనలో 16.7 శాతం. నిరుద్యోగం 2018-19 లో 5.3 శాతమైతే 2022-23 నాటికి 4.1 శాతం. ఆర్థిక పరిస్థితిపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. అప్పులపై నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా అంటూ నిప్పులు చెరిగారు ఆర్ధిక మంత్రి బుగ్గన