ఎన్నికలు దగ్గరవుతున్నా టీడీపీ లిస్టు రాకపోవడం వెనక కారణం బిజెపితో పొత్తు పై ఆశ చావకేనా .
2014 ఎన్నికల్లో టీడీపీ, బిజెపి, జనసేన ఉమ్మడిగా పోటీ చేయడంతో పాటు అలవిగాని హామీలతో అధికారం ఛేజిక్కించుకొన్న బాబు తానిచ్చిన హామీలని ఎగగొట్టటంతో పాటు, కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని తన చేతుల్లోకి తీసుకోవటానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేసి లక్షన్నర కోట్ల ప్రత్యేక ప్యాకేజి అంటూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి హోదా అంశాన్ని సమాధి చేశారు. ఆ తర్వాత లక్షన్నర కోట్ల ప్యాకేజి కూడా అమలు కాకపోవటంతో ప్రజల్లో
బిజెపి, టీడీపీ పట్ల నెలకొన్న అసమ్మతి గ్రహించిన బాబు ఈసారి ఎన్నికల్లో బిజెపితో పొత్తులో ఉంటే గెలవడం కష్టమని గ్రహించి ఎన్నికలకు ఏడాది ముందు పొత్తుకు బైబై చెప్పి మళ్ళీ హోదా అంశాన్ని భుజానికెత్తుకొని బిజెపిని విమర్శించడం మొదలుపెట్టారు.
బిజెపి కూడా అదే స్థాయిలో స్పందించి టీడీపీ పై విమర్శలు చేయడంతో పాటు పోలవరం బాబుకి ఎటిఎంగా మారిందని చంద్రబాబు రాష్ట్రం కోసం కాక లోకేష్ కోసం పని చేస్తున్నాడని ప్రధాని మోడీ విమర్శించటంతో గంగవెర్రులెత్తిన చంద్రబాబు మోడి భార్యని వదిలేసాడని, మోడీకి పిల్లలు లేరని, మోడీకి కుటుంబ విలువలు తెలియవని దిగజారి చేసిన వ్యాఖ్యలు బాబు మర్చిపోయినా మోడీ సహా బిజెపి నేతలు ఎవరూ మర్చిపోయి ఉండరు. ఆ తరువాత తిరుపతిలో అమిత్ షా పై రాళ్లు వేయించడం, ఓ బహిరంగ సభలో బాబు ఎదుటే బాలకృష్ణ ప్రధానిని ఉద్దేశించి మాకీ చూద్ అని తిట్టడం లాంటివి బిజెపి ఆగ్రహానికి ఆజ్యం పోసాయి .
2019 ఎన్నికల్లో బాబు ఓడి బిజెపి గెలవడంతో నాటి నుండి మళ్ళీ బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసిన బాబు అవి సఫలం కాకపోవడంతో భవిష్యత్తులో రాజీ మాట్లాడటానికి, తన పనులు చక్కబెట్టటానికి పనికివస్తారనే ఉద్దేశ్యంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులని , ఎంపీలని పంపటంతో పాటు ఏకంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని కూడా బిజెపిలో విలీనం చేయించాడు.
నాటి టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, టిజీ వెkalapaలు బిజెపిలో చేరి టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బిజెపిలో విలీనం చేస్తున్న వేళ ఒక్క టీడీపీ నేత నుండి చిన్న ప్రతిఘటన కానీ, ఒక్క విమర్శ కానీ లేకపోవడం వెనక ప్రధాన కారణం బాబు ప్రొద్భలంతోనే, బాబు కనుసన్నల్లోనే ఇదంతా జరగడం వలనే అని రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి అర్ధమైంది. ఇలా బిజెపిలోకి పోయిన టీడీపీ ఎంపీలు ఎప్పటికి బాబు కోసమే పని చేస్తారనే దానికి గొప్ప నిదర్శనం ఇటీవల టీడీపీ కోసం పని చేయాలంటూ ప్రశాంత్ కిషోర్ ని కోరిన బాబుని కలవడానికి ప్రశాంత్ కిషోర్ ని టీడీపీ నుండి పార్టీ ఫిరాయించిన సీఎం రమేష్ కి చెందిన ప్రత్యేక విమానంలో ఏపీకి పంపడం .
బాబు చేసే ఈ కుట్రా రాజకీయాలు నిసితంగా గమనిస్తున్న బిజెపి అగ్రనేతలు టీడీపీ నుండి ఎవరు వచ్చినా తమ పార్టీలోకి చేర్చుకొంటున్నారు కానీ బాబుని మాత్రం దగ్గరికి చేరనివ్వలేదు . చివరికి తన దత్త పుత్రుడిగా పేరు బడ్డ పవన్ కళ్యాణ్ 2019 లో విడిగా పోటీ చేసినా బాబు చెప్పిన వారికి టికెట్లు ఇచ్చి బాబు చెప్పుకొన్నట్టు నడిచి అత్యంత విశ్వాస పాత్రుడిగా మారడంతో తనైనా బిజెపితో కలపటానికి సహకరిస్తాడేమో అన్న ఆశతో తనని కూడా బిజెపి వైపు పొత్తు పేరిట పంపాడు. అయినా బిజెపి వైపు నుండి సానుకూలత కనపడకపోవడం అవినీతి కేసుల్లో ఉన్న కాస్త పరువు పోవడంతో విధిలేని పరిస్థితుల్లో బిజెపితో పొత్తులో ఉన్న పవన్ తో మళ్ళీ బహిరంగ పొత్తు పెట్టుకొన్నాడు.
అయినా గెలుస్తామనే ఆశ కూడా కనపడక పోవడంతో పాటు చివరి నిమిషం వరకూ బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిద్దాం అనే ఆశ ఉండడంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులని ప్రకటించిన తర్వాత పొత్తు కుదుర్చుకొనే అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థులని ప్రకటించకుండా తాత్సరం చేస్తున్నాడు బాబు . ఇదే సమయంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకి కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం రావడంతో ఇదే అదనుగా పొత్తు కోసం మరోసారి ప్రయత్నించడానికి పవన్ ని వెంట బెట్టుకొని బయలుదేరాడు బాబు.
గతంలో హరికృష్ణ భౌతిక కాయం వద్ద పొత్తు ప్రయత్నాలు చేసి భంగపడ్డ బాబు ఈసారి బిజెపితో పొత్తు కోసం చివరి ప్రయత్నంగా బాలరాముని విగ్రహావిష్కరణ వద్ద ప్రయత్నాలు చేయనున్నాడా అంటే అవుననే చెప్పొచ్చు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ చనిపోయిన గంటల వ్యవధిలోనే ఆయన చితి ఆరకముందే పోయినాయనా ఎటూ పోయాడు. మనం కలిసి పని చేద్దాం రమ్మని ఎన్టీఆర్ వర్గ ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టిన ఘన చరిత ఆయన సొంతం .