బాబు ఉన్న దిక్కుమాలిన పరిస్థితిని ఎలా కౌంటర్ చేసుకోవాలో అర్థం కాని రాధాకృష్ణ, జగన్ ఢిల్లీ పర్యటనపై తనదైన స్టైల్ వార్త వండేశాడు…
జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు.. ఇవాళ కుదరదు, రేపు చూద్దాం లే పో అన్నట్టు…. మరో వైపు బీజేపీ తో టీడీపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు ఇరువర్గాల నుండి సమాచారం అన్నట్లు కథనం అల్లేసింది జ్యోతి… కానీ బీజేపీ వైపు నుండి పొత్తు గురించి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడిన వీడియో బైట్ కానీ, పోనీ న్యూస్ కానీ ఎవరూ చూడనేలేదు… ఒక్క జ్యోతి తప్ప…
బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులేమో ఇవాళ 25 సార్లు బాబు అడుక్కుంటే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడని గాలి తీసేసారు.. దానికి ముందు రాష్ట్రం కోసం తప్పదేమో అని బాబు తమ పార్టీ వారితో అన్నట్లు ప్రచారం కూడా చేసేసాయి… “అసలు రాష్ట్రం కోసరం ఇంకెన్ని త్యాగాలు చేస్తారు బాబూ, ప్రతీ ఎన్నికల సమయంలో మీరు చేసే త్యాగాలకి అడ్డుఅదుపూ లేకుండా పోతుంది… “
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కలవాలి అనుకుంటే ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్ అడుక్కోవాలా? అక్కడ తనవారి ద్వారా అపాయిట్మెంట్ అడిగించలేడా? అపాయింట్మెంట్ కన్ఫామ్ అయ్యాకే బయలుదేరి వెళ్లలేడా? ఇన్నేళ్ల నుండి రాజకీయాలు చూస్తున్నాడు… రాధాకృష్ణ కి ఆ మాత్రం అర గ్రాము బుర్ర లేదా? ఉంటది వాడడు అంతే… బాబు కోసం ఏ గడ్డైనా కరుస్తాడు…
పాపం వార్త రాసి అమ్మేసుకున్న కాపీ లు ఇంకా బజ్జీ బండి వాళ్ల దగ్గరకి పోకుండానే ప్రధానితో జగన్ భేటీ అయ్యాడు…. ఆ జేసీ అన్నట్టు… తుడుచుకోడానికి కూడా పనికిరాని పేపర్ లో ఇలాగే వస్తుంటాయ్ మరి వార్తలు…