ఎన్నో విప్లవాలు దేశంలో పెను మార్పులకు కారణమయ్యాయి. వాటిలో హరిత, శ్వేత, నీలి విప్లవాలు ప్రముఖంగా ఉంటాయి. ఇవి ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చాయి. ఆహార భద్రత లభించింది. ఇంకా ఎన్నో రకాలుగా మేలు జరిగింది. ఎవరైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే మార్పు సాధ్యమవుతుంది. అదే తరహాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎంతో ముందుచూపుతో పలు కార్యక్రమాలను ప్రారంభించింది. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేయని పనులను సులువుగా అమల్లోకి తెస్తోంది.
మన రాష్ట్రంలోని మత్స్యకారుల కలలను సాకారం చేసేందుకు జగన్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఉపాధి నిమిత్తం ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు శ్రీకారం చుట్టింది.
ఎక్కడంటే..
ప్రభుత్వం జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, మంచినీళ్ల పేట, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపు తిప్పల్లో ఫిషింగ్ హార్బర్లను రూ.3,520 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తోంది. అలాగే చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదుర్గం వద్ద రూ.126 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది.
సీఎం జగన్ ముందుచూపుతో.. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ప్రారంభానికి ముస్తాబవుతోంది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి
బ్లూ ఎకానమీకి దోహదం
ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం రాష్ట్రంలో ఎకానమీకి ఎంతగానో దోహదపడనుంది.
హార్బర్ల ద్వారా మత్స్యకారులు మన తీరంలోనే వేట చేసుకొని అధికాదాయం పొందవచ్చు. ఇంకా హార్బర్ ఆధారిత పరిశ్రమలు రానున్నాయి అదనంగా 4.6 లక్షల టన్నుల మత్స్య సంపద లభిస్తుంది. రాష్ట్ర జీడీపీ రూ.9 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పనుల వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
బాబు హయాంలో నిల్..
చంద్రబాబు పెద్ద విజనరీ అని, అభివృద్ధికి ఆయన మారుపేరని ఎల్లో మీడియా ఎప్పుడూ ఊదరగొడుతుంది. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితిని మార్చే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తదితరాల నిర్మాణాలు మాత్రం ఆయన ఉన్నప్పుడు జరగలేదు. ఇవన్ని వైఎస్ జగన్ హయాంలోనే సాధ్యమయ్యాయి. అయితే బాబులా జగన్ ఏనాడూ డబ్బా కొట్టుకోలేదు. మాటలు కాదు.. చేతలు ముఖ్యమని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే అభివృద్ధి కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.
– వీకే..