ఆంధ్రప్రదేశ్ 974 km తో గుజరాత్ తరువాత రెండో పొడవైన సముద్ర తీరమున్న రాష్ట్రం అని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2022 -23 పోర్టుల సామర్థ్యం 1352 మిలియన్ టన్నుల మొత్తములో 10 .4 % వాటాతో తో ఐదవ స్థానములో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత మొదటి 5 ఏళ్లలో సన్ రైజ్ స్టేట్, పొడవైన సముద్ర తీరప్రాంతమున్న రాష్ట్రమని గొప్పగా ప్రచారమైతే హోరెత్తించారు చంద్రబాబు. కానీ అంతటి అద్భుత సానుకూలతను నిజంగా ఏమైనా వాడుకున్నారా అంటే సున్నా అని చెప్పొచ్చు.
ప్రస్తుత YCP ప్రభుతం వచ్చాక 4 నూతన పోర్టుల పనులు మొదలు పెట్టడముతో పాటు ఇప్పుడు రామాయపట్నం పోర్టు మొదటి దశ ప్రారంభానికి సిద్ధమైంది . దీనితో పాటు 10 ఫిషింగ్ హార్బర్ లను అభివృద్ధి చేస్తోంది. తొందర్లోనే అవి కూడా క్రమంగా అందుబాటులోకి వచ్చి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయ పురోభివృద్ధిని సాధించే దిశగా గట్టి అడుగులు పడుతున్నట్లే.
మొత్తం ప్రపంచ వాణిజ్యం 32 ట్రిలియన్ USD ( 26,51,52,000 కోట్ల రూపాయలు) లలో సర్వీస్ సెక్టార్ వాటా 25 శాతమైతే మిగిలిన 75 శాతం తయారీ , మినరల్ అండ్ ఆయిల్స్ ఇతర రంగాలది.
మన సర్వీస్ రంగం ఎక్సపోర్ట్స్ ( 26 .51 లక్షల కోట్లు ) ప్రపంచ సర్వీస్ రంగములో 4 % , మొత్తం ప్రపంచ వాణిజ్యములో 1 శాతానికి పరిమితం.
మన తయారీ ఇతర రంగాల వాటా ( 37 .51 లక్షల కోట్లు )ప్రపంచ తయారీరంగ వాణిజ్యములో 2 శాతం , మొత్తం వాణిజ్యములో 1 .5 శాతం మాత్రమే.
ఇక మన IT మరియు BPO ఎక్సపోర్ట్స్ 16 లక్షల కోట్లకు పరిమితం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమికంగా మంచి తీరప్రాంతముతో కూడిన వ్యవసాయరాష్ట్రం, ప్రపంచ వాణిజ్యములో వ్యవసాయ రంగం వాటా 10 %, ఆ వ్యవసాయ వాటాలో మనదేశ వాటా కేవలం 2శాతం. అందులో తిరిగి పండ్లు, పూల ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా దాదాపు 55 శాతం.
మనము IT లో ఎంతో సాధించిందనుకుంటున్న హైదరాబాద్ IT ఎక్సపోర్ట్స్ విలువ 2 .4 లక్షల కోట్లు. గుజరాత్ 10 వేల కోట్లు కూడా లేదు కానీ వాళ్ళ తయారీ రంగం ఎగుమతులు 12 లక్షల కోట్లకుపైగా ఉండి దేశములో మహారాష్ట్ర తరువాత రెండో స్థానములో ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అభివృద్ధి అంతా IT తో సాద్యమని భ్రమపడకుండా దానికంటే ముందు మన రాష్ట్రానికున్న సానుకూలతలు ఆలంబనగా అభివృద్ధి సాధించవచ్చని గుజరాత్ ను చూసి నేర్చుకోవచ్చు.
ఏది ప్రచారములో ఉంటె దాని మాయలో పడి నేల విడిచి సాము చేయటం వాళ్ళను గొప్ప విజనరీలుగా అంతే గొప్పగా ప్రచారం చేయటం, చేసుకోవటం ఆంధ్ర రాష్ట్రనికి దక్కిన ఒక శాపం.
సౌత్ కొరియా 1948 లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెంటనే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఆటోమొబైల్స్ , ఎలక్ట్రానిక్స్ లలో సాధించిన అద్భుత విజయాలు కాకుండా వాళ్ళ స్థితిగతుల ఆధారంగా విగ్గుల తయారీ ఎగుమతులపై పట్టు సాధించి తరువాత స్టీలు ఉత్పత్తి దాని ద్వారా ఆటోమొబైల్స్ రంగములోకి ప్రవేశించటం, గొప్ప ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను అభివృద్ధి చేసుకొని ఎలక్ట్రానిక్స్ ఇతర సాంకేతిక రంగాల్లో దూసుకుపోయి శీఘ్ర గతిన ప్రగతి సాధించిన దేశంగా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో పాటు , నూతనంగా వస్తున్న ఒక్కో పోర్టు వద్ద అందుబాటులకి రానున్న 3000 -5000 వేల ఎకరాల పారిశ్రామిక భూములలో తగు పరిశ్రమలు ఏర్పాటు తో పాటు విశాఖలో IT అభివృద్ధికి పడుతున్న గట్టి అడుగులు అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుంది.