జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగున్నరేళ్ల కాలంలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాయి. 24 లో ఇప్పటికే 19 కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి, మరో అయిదు కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకొని త్వరలోనే కార్యకలాపాలను నిర్వహించకోవడానికి సిద్దంగా ఉన్నాయి. మొత్తం ఈ కంపనీల ద్వారా 10,705 కోట్ల పెట్టుబడులు ద్వారా 36205 మందికి ఉపాధి లభించింది.
గత ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా మరో 23 కంపనీలు ఒప్పందం కుదుర్చుకొని రూ.15,711 కోట్ల పెట్టుబడులు ద్వారా 55,140 ఉద్యోగాలు లభించునున్నాయి .
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటికే ఉన్న మూడు ఈఎంసీ (ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్)లు తిరుపతి ఈఎంసీ – 1, తిరుపతి ఈఎంసీ – 2, శ్రీసిటీ ఈఎంసీ లలో మౌలిక వసతులు పెంచి వీటికి తోడుగా వైఎస్ఆర్ జిల్లా కడప దగ్గరలో వైఎస్ఆర్ ఈఎంసీను స్థాపించి అభివృధి చేసింది. వైఎస్ఆర్ ఈఎంసీ 801 ఎకరాల్లో అభివృద్ధికి అవకాశంగా మొదటి దశలో 540 ఎకరాలలో రూ.749 కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఇప్పటికే రూ.8910 కోట్ల పెట్టుబడులును ఆకర్షించి 28250 మందికి ఉపాధి కల్పనకు బాటలు వేశారు. .
కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్ రంగం లో చైనా దిగుమతులు తగ్గించుకోవాలన్న లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంది. పీఎల్ఐ స్కీంకి కింద ఇప్పటికే డిక్సన్, టెక్నోడ్రోమ్, సెల్ కాన్, రిజల్యాట్, సాఫ్టాసిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ లతో పాటు విద్యుత్ ఉపకరణాల తయారు చేసే మరెన్నో కంపెనీలు రానున్నాయి.కొప్పర్తి ఈఎంసీ రెండో దశలో 261 ఎకరాలలో అభివృద్ధి చేయనున్నారు. పూర్తిస్థాయిలో కొప్పర్తి ఈఎంసీ పనిచేస్తే ఏటా రూ. 33600 కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు, దీని ద్వారా మొత్తం 71వేలమంది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వైఎస్ఆర్ ఈఎంసీ ద్వారా వైఎస్ఆర్ జిల్లా లో స్థూల ఉత్పత్తి స్థాయి 15 శాతం పెరిగి రూ .47000 కోట్లకు చేరుకోనుంది.
ఏసీ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 లక్షల ఏసీలు అమ్మడుపోతుంటే అందులో ఒక్క మన రాష్ట్రం నుంచి 50 లక్షల ఏసీలు తయారు అవుతున్నాయి.దక్షిణాది రాష్ట్రాలలో జరిగే ఏసీ అమ్మకాలలో 80 శాతం మనం రాష్ట్రం లో తయారయ్యే ఏసీలే ఉండనున్నాయి. పీఎల్ఐ స్కీం కింద శ్రీసిటీ లో ఏసీలు తయారు చేసి కంపెనీ లు క్యూ కట్టాయి. జపాన్ కి చెందిన డైకిన్ ఒక ఏడాదికి 25 లక్షల యూనిట్ల సామర్థ్యంతో పనులు మొదలు పెట్టి మొదటి దశలో 10 లక్షల ఏసీ లు తయారు చేసే ప్లాంట్ నీ నిర్మించారు. రెండు దశలో మరో 15 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా మరో ప్లాంట్ ను వేగంగా సిద్ధం చేస్తున్నారు. ఇందులో డైకిన్ సంస్థ 1000 కోట్లు పెట్టుబడి పెట్టింది. అలాగే బ్లుస్టార్ ఏటా 12 లక్షల ఏసీలు తయారు చేయాలని ఆకాక్షించి 500 కోట్ల పెట్టుబడితో శరవేగంగా ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. డైకిన్, బ్లుస్టార్ తో పాటుగా హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లును ఏర్పాటు చేశాయి. దేశం లో అమ్ముడుపోయే ప్రతి రెండు ఏసీ లలో ఒకటి మన రాష్ట్రం లోనే తయారైనదే అని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం లో రూ.3755 కోట్ల కు పైగా పెట్టుబడులను ఆకర్షించి 10, 000 మందికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగుతుంది.