పేదరికాన్ని రూపుమాపే శక్తి విద్యకు మాత్రమే ఉంది. ఒకప్పుడు చదువుకోవడం ఖరీదైన వ్యవహారం. పేదలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో జాతీయ స్థాయిలో విద్యా సౌలభ్యం కలిగిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికులకు విద్యను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రంగా ఏపీ ఇప్పుడు కేరళను అధిగమించింది. ఇది పూర్తిగా జగన్ విజయం. ఈఏసీ – పీఎం (ప్రధాని ఆర్థిక సలహా మండలి) విడుదల చేసిన ప్రాథమిక అక్షరాస్యత నివేదికలో ఏపీ 38.50 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. కేరళ 36.55తో రెండో స్థానంలో ఉంది.
విద్య ప్రభుత్వ భాద్యత కాదు అని ప్రకటించిన చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో విద్యా రంగంలో ప్రైవేట్‌ను ప్రోత్సహించారు. ఫలితంగా కార్పొరేట్ మాఫియా రెచ్చిపోయింది. చదువును డబ్బుతో కొలిచింది. అదే క్రమంలో ప్రభుత్వ బడులు అధ్వానంగా తయారయ్యాయి. వసతుల్లేక విద్యార్థులు అల్లాడేవారు.
జగన్ సీఎం అయ్యాక విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. నాణ్యమైన విద్య అందించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విద్య అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ఒకటి. ప్రైమరి ఎడ్యుకేషన్ స్థాయిలో డ్రాపవుట్స్ తగ్గించటానికి పిల్లలను బడికి పంపితే తల్లికి ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తానని ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో చాలామంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో తమ సంతానాన్ని చదువుకునేందుకు పంపేవారు కాదు. పల్లెల్లో ఇలా ఎక్కువగా జరిగేది. పెద్దలు కూలి పనులకు వెళ్లేవారు. పిల్లలు పొలం పనికి లేదా గొర్రెలు, మేకలు కాసేందుకు పోయేవారు. పట్టణాల్లో అయితే దుకాణాల్లో పనిచేసేవారు. ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలుంటే ఒకరికి మాత్రమే విద్యనభ్యసించే అవకాశం దక్కేది. జగన్ ఇచ్చిన ఆర్థిక భరోసాతో చదువుకు దూరమైన వారంతా తిరిగి పాఠశాల బాట పట్టారు. అదే సమయంలో ప్రైవేట్ నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు అమ్మఒడి ఒక కారణమైంది. ఇలా పాఠశాలలకు పిల్లల్ని పంపుతూ అమ్మవడి పధకం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 44 లక్షలకు పైగా ఉంది. అమ్మవడి పధకం ద్వారా ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం రూ.26,067 కోట్లు. ఇలా విద్యకి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత వలనే కేంద్ర ప్రాథమిక అక్షరాస్యతా నివేదికలో ఏపీకి ప్రధమ స్థానం దక్కింది.