గుంటూరు ఎంపీ, అమరరాజా కంపెనీ అధినేత గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాలను వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన అభిమానగణానికి విందు ఇచ్చారు. ఇందులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్ని అవాక్కయ్యేలా చేశాయి. రాజకీయంగా జయదేవ్‌ను మిస్ అవుతానన్నారు. ఆయన అమరావతి రైతుల తరఫున పోరాటం చేశారన్నారు. గల్లా సంస్థలను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నిజం ఏంటంటే చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం గల్లా ఫ్యాక్టరీలను వాడుకోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అమరరాజా ఫ్యాక్టరీలో కాలుష్యంపై పర్యావరణ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంలో టీడీపీ, ఎల్లో మీడియా జగన్‌పై విషం కక్కాయి. వైఎస్సార్సీపీ నాయకులు తమ మాట వినలేదని గల్లాను వేధిస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం కక్ష సాధించడంలేదని, కాలుష్యం వ్యవహారంపై కోర్టులో కేసు ఉందని, దీనిని ఎదుర్కొంటున్నామని జయదేవ్ చెప్పినా బాబు వినలేదు. అమరరాజా కంపెనీని రోడ్డుకు లాగుతూ వచ్చారు. ఇవన్నీ దాచిపెట్టి లోకేశ్ జగన్‌పై బురద వేస్తున్నారు. గల్లా రాజకీయాలు వదుకోవడానికి బాబు ఒక కారణమైతే ఈసారి ఆయన గుంటూరులో గెలిచే పరిస్థితి లేదు. ఇది మరో కారణం. ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండడని పేరుంది. దీంతో ఓడిపోతానని గ్రహించి రాజకీయాలకు తాత్కాలికంగా విరమణ ప్రకటించినట్లు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. గల్లా విషయంలో వాస్తవాలు వేరేలా ఉంటే టీడీపీ మాత్రం వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తూ శునాకానందం పొందుతోంది.