‘సార్ మేం పవన్ కళ్యాణ్ అభిమానులం. వేరే ఊరి నుంచి వచ్చాం. కొద్దిరోజులు ఆయన కోసం పిఠాపురంలో తిరుగుతాం’ అని మెగా మిడిల్ బ్రదర్ నాగబాబుకు చెబితే ‘అవన్నీ తర్వాత.. ముందు ఎన్నికల ఖర్చులకు డబ్బులు కావాలి. డొనేషన్ ఎంతిస్తారో చెప్పండి’ అంటూ నవ్వుతూ అడిగేస్తున్నాడంట.
ఎన్నికలను అడ్డం పెట్టుకుని నాగబాబు డబ్బు కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని జనసైనికులే వాపోతున్నారు. ఎవరైనా ఆయన్ను కలిస్తే ‘జనసేన చాలా పేద పార్టీ. పవన్, నేను సినిమాల్లో సంపాదించిందంతా పెట్టేశాం. అయినా సరిపోవడం లేదు. కాస్త డొనేషన్లు ఇవ్వండి. వేరే వాళ్ల చేత ఇప్పించండి’ అంటూ బతిమిలాడుతున్నట్లు తెలిసింది.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ తక్కువ తిరుగుతూ చంద్రబాబుతో కలిసి ప్రచారంలోనే ఎక్కువగా ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో బాధ్యతలను తన అన్న నాగబాబుకు అప్పజెప్పాడు. ఈయన తమ్ముడి పర్మిషన్ తీసుకుని దుకాణం తెరిచేశాడు. ఇలా చేయడం కొత్త కాదు. గతంలో ప్రెస్మీట్లలో ఫోన్ నంబర్లు చెప్పి డొనేషన్లు చేయాలని అడుక్కునంత పనిచేసిన మహానుభావుడు. ప్రతినెలా ఒకటో తేదీ వస్తుందంటే చాలు జనసైనికుల నుంచి డబ్బులు దండేందుకు ఈ మెగా మిడిల్ బ్రదర్ రెడీ అయిపోతాడు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈయన వసూళ్లు చాలా ఎక్కువవయ్యాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో పవన్ గెలవాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అంత మొత్తం మేము సర్దలేకపోతున్నామని, ఏదో ఒకటి చేయాలని తనను కలిసేందుకు వచ్చే వారికి చెబుతున్నాడట.
తక్కువ సీట్లు తీసుకున్నందుకు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చాడు. జనసేన నేతలకు వెన్నుపోటు పొడిచి టీడీపీ నేతలకు టికెట్లు ఇప్పించినందుకు పవన్‌కు భారీ మొత్తంలోనే ముట్టింది. ఇంకా తీసుకున్న సీట్లలో కొన్నింటిని కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. అయినా వీరి ధన దాహం తీరలేదు. నాగబాబు సినిమా పరిచయాలను కూడా తెగ వాడేస్తున్నాడంట. చిన్నచిన్న ఆర్టిస్టుల నుంచి కూడా ఎన్నికల ఖర్చుల పేరుతో డబ్బు లాగేస్తున్నాడని సమాచారం. మెగా ఫ్యామిలీకి భజన చేసే ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు కొందరున్నారు. వాళ్లు కూడా కలెక్షన్లు చేసి ఇస్తున్నారట. పార్టీకి మద్దతు ఇచ్చే ఎన్ఆర్ఐలను అయితే పీల్చి పిప్పి చేస్తున్నాడట నాగబాబు.
మొన్నటి వరకు పాత సినిమాల రీ రిలీజ్‌ల పేరుతో ప్రేక్షకుల జేబులు ఖాళీ చేశారు. ఇప్పుడు ఎన్నికల పేరుతో చాలామందిని నిలువు దోపిడీ చేస్తున్నారు. జనసేన గ్యాంగ్ అలీబాబా 40 మంది దోపిడీ దొంగల ముఠాను తలపిస్తోంది.