రెండు దశాబ్దాల క్రితం సమసిపోయిన బాంబుల సంస్కృతి పల్నాడులో మళ్ళీ రెక్కలు విప్పుతున్న పరిస్థితి కనబడుతోందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు .
వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడు గ్రామంలో నేడు ఉదయం బాంబుల కలకలం రేగింది. గత టీడీపీ హయాంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు కొందరు ఊరు వదిలి అజ్ఞాతంలో జీవిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేల ఐదు రోజుల క్రితం ఈ టీడీపీ నేతలు మళ్ళీ ఊర్లోకి రావడం జరిగింది .
కాగా నేటి ఉదయం జంగమహేశ్వరపురం గ్రామంలో ఎన్నికల బందోబస్తు కోసం పోలీసులు విడిది చేసి ఉన్న ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఒక తెలుగుదేశం నాయకుడి ఇంట్లో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సోదా చేయగా 17 నాటు బాంబులు, 3 వేట కొడవల్లు, 3 బరిసెలు, ఒక చిప్ప గొడ్డలి, కొన్ని ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.
దాదాపు ఇరవై రెండు ఏళ్ల క్రితం అప్పటి గుంటూరు ఎస్పీ సీతారామాంజనేయులు విశేష కృషితో, తర్వాత వైఎస్ పాలనలో పెరిగిన విద్య, ఉపాధి అవకాశాలతో కనుమరుగైన ఫ్యాక్షన్ బాంబుల సంస్కృతి నేడు మళ్ళీ కనపడడం ఆశ్చర్యమేమీ కాదు . ఇది రెండేళ్ల క్రితం అందరూ ఊహించిందే .
1999 నుండి 2002 వరకూ మాచర్ల నియోజకవర్గంలో నడిచిన తీవ్రమైన ఫ్యాక్షన్, బాంబుల సంస్కృతిలో దాదాపు ముప్పై మందికి పైగా అశువులు బాయగా, అందులో 26 మంది కాంగ్రెస్ నాయకులే అని అప్పటి వార్తలు, దీని వెనక ప్రధాన పాత్ర వహించిన, 2001 లో దుర్గి మండలంలో జరిగిన ఏడు హత్యల్లో ప్రధాన ముద్దాయి అయిన నాటి టీడీపీ ఎమ్మెల్యే తనయుడు జూలకంటి బ్రహ్మా రెడ్డి పాత్ర సుస్పష్టం. 2002 లో గుంటూరు జిల్లా ఎస్పీగా వచ్చిన సీతారామాంజనేయులు నాడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా జూలకంటిని, అతని అనుచరులని గుంటూరు పోలీసు డార్మెటరీకి పిలిపించి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ లతో జూలకంటి ఫ్యాక్షనిజంకి అడ్డుకట్ట వేసాడు.
2009 ఎన్నికల తర్వాత మాచర్ల ప్రజల తిరస్కృతితో రాజకీయంగా కూడా కనుమరుగైన జూలకంటిని 2021 డిసెంబర్ లో మాచర్ల టీడీపీ ఇంచార్జి గా చంద్రబాబు ప్రకటించిన నాడే పల్నాడు ప్రజానీకం ఉలిక్కిపడింది. మళ్ళీ బాంబులు, వేట కొడవళ్లు సంస్కృతి వస్తుందని .
అందరూ ఊహించిందే జరిగింది, జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయడం మాచర్ల ప్రజల చేతిలోనే ఉంది.