ల్యాండ్ టైటలింగ్ చట్టం పై దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‌లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్నీ సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టాలని ఏపీ సీఐడీకి ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన సిఐడి విచారణ నిమిత్తం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మొదటిసారి ఇచ్చిన నోటీసులను పట్టించుకోకపోవడంతో సిఐడి మరోసారి నోటీసులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు అందజేసి విచారణకి రమ్మని నోటీసులు ఇవ్వనుంది. ఈ నోటీసులు కూడా స్పందించకపోతే సిఐడి తదుపరి చర్యలకు సిద్ధం అవుతుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది. దేశంలో ఉన్న భూ వివాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు ముందు భూ సర్వే జరపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిహద్దు తగాదాలు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు తర్వాత డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా అందజేయనున్నారు. ఈ యాక్ట్ ను అమలు చేసేకంటే ముందు సమగ్ర భూ సర్వే పూర్తి చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం భూ వివాదాల వల్ల ప్రజలు..అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని..ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్‌కు రూపకల్పన జరిగిందన్నారు. సర్వే పూర్తయ్యాక ఆ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందన్నారు.