ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు విశాఖ పట్టణంలో ఘనంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు అయ్యి విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. ముగింపు సభలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు టాలెంట్ ను వెలికి తియ్యడానికి మొదటి సారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయి అని, ఇలా ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తాం అని తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో ప్రతిభ కనబర్చిన 14 మంది క్రీడకారులను వివిధ ఫ్రాంచైజీ వాళ్ళు, అసోసియేషన్ లు తీసుకన్నాయి అని తెలిపారు. సెలెక్ట్ అయినా వారికీ ఆ సంస్థలు ఆటలో ఇంకా మెళుకువలు, తర్ఫీదు ఇచ్చి వాళ్ల్లు రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయిలో ఆడేలా ప్రోత్సయిస్తాం అని తెలిపారు.
అలా సెలెక్ట్ అయిన క్రీడకారులు క్రికెట్ నుంచి పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా)ని చెన్నై సూపర్ కింగ్స్ , శివ (అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా), గాయత్రి (కడప జిల్లా)ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) దత్తత తీసుకుంది. సతీష్ (తిరుపతి), బాలకృష్ణా రెడ్డి (బాపట్ల) ప్రో కబడ్డీ టీమ్ , సుమన్ (తిరుపతి), సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకుంది. వాలీబాల్ సంబంధించి ఎం. సత్యం (శ్రీకాకుళం),మౌనిక (బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం) లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్లో ఎ.వంశీకృష్ణం రాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది.