ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పై తీస్తున్న వ్యూహం సినిమా విడుదల అవకుండా చూడటానికి టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. సినిమాలో ఏముందో లేదో కూడా తెలీక ముందే “చంద్రబాబు పరువు ప్రతిష్టలకు భగం కల్గించే అంశాలు ఉండి ఉంటాయంటూ” తమ భయాన్ని బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, సరిటికెట్ జారీ చేయడంతో దాన్ని సవాలు చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. తాజాగా ఒక కమిటీ ఏర్పాటు చేసి సిబిఎఫ్ సీ నిర్ణయాన్ని పరిశీలిద్దామని చేసిన న్యాయమూర్తి ప్రతి పాదనని నిర్మాత తఫరు న్యాయవాది తిరస్కరించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ అయిపోయిన తర్వాత కమిటీ ఏర్పాటు చెస్తే, ఇది ఒక సంప్రదాయంగా మారి, ప్రతి సినిమాకీ ఇటువంటి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతి పాదనలు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ సీల్డ్ కవర్లో ఉన్నా, తమకు ఇవ్వలేదని, అభ్యంతరాలుంటే పంచుకోరాదని అంటున్నారని, దీన్ని బట్టి చూస్తే చంద్రాబాబు ప్రతిష్టకు భంగం కల్గించే అంశాలు సినిమాలో ఉన్నట్లే అని వాదిస్తున్నారు.
ఏదైనా రాజకీయ సినిమా వస్తుందంటే వణికిపోవడం తెలుగు దేశం పార్టీకి ఎన్ టీ ఆర్ హయాం నుంచీ ఉన్న అలవాటే. కోట శ్రీనివాస రావు ప్రధాన ప్రాత్రగా మండలాధీశుడు సినిమా వచ్చినపుడు ఎన్ టీ ఆర్ కూడా ఇంత హడావుడీ చేశారు. ఆ తర్వాత కోట శ్రీనివాస రావు మీద దాడులకు కూడా కొందరు ప్రయత్నించారని అంటారు.
లక్ష్మీస్ ఎన్ టీ ఆర్ సినిమా వచ్చినపుడు కూడా వీళ్ళు ఇలాగే భయపడి ఆ సినిమా విడుదలను అడ్డుకున్నారు. ఇప్పుడు వ్యూహం సినిమాకి కూడా భయపడి ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. మరో వైపు యాత్ర 2 విడుదలకు సిద్ధం కావడం, ట్రైలర్ కి విపరీతమైన ఆదరణ లభిస్తుండటం వీరి ఆందోళనకు మరో కారణం