రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు,పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం ప్రారంభమైంది. ఐఆర్,పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలపై ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం చర్చలు జరుపుతుంది.
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వివి సత్య నారాయణ,సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్,జిఏడి అదనపు కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా వర్చువల్ గా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల నుండి ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి,ఎపి ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్,పిఆర్ టియు అధ్యక్షులు యం.కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు,ఎపిటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయరాజు, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెసిఆర్. సూర్యనారాయణ,ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎస్.బాలాజీ,ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు సంసాని,ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్,అదే సంఘం మరో విభాగం అధ్యక్షులు ఎస్.మల్లేశ్వరరావుతోపాటు ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.