ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తోంది.2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో 26,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. అందులో ఇప్పటివరకు 10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. తద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో 36205 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. అంతే కాకుండా మరో 15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి.
ఈ అయిదేళ్ళ కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సీన్, హ్యావెల్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. ఇప్పటికే ఒక ప్లాంట్ కలిగిన సంస్థలు, విస్తీర్ణంలో భాగంగా రెండో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం అయ్యాయి. దేశంలో వాడే ప్రతి రెండు ఏసీలలో, ఒక ఏసీ ఆంధ్రలోని శ్రీసిటీలోనే తయారు అవుతుంది. డైకిన్ తమ మొదటి దశలో ఏటా 10 లక్షల ఏసీలు తయారు అయ్యేలా ప్లాంట్ ఏర్పాటు చేసింది, ఇప్పుడు మరో 1000 కోట్లతో ఏటా మరో 15 లక్షలు ఏసీలు తయారు చేసే విధంగా ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. బ్లూ స్టార్ సంస్థ ఇప్పుడు ఏటా 12 లక్షల ఏసీలను తయారు చేస్తోంది.మరో 10 లక్షల ఏసీలు తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏసీలు తయ్యారుకు శ్రీ సిటీ వేదికైంది.
శ్రీసిటీ ఈఎంసీకు బలం చేకూర్చేలా, కడప జిల్లా కొప్పర్తిలో మరి ఈఎంసీను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోప్పర్తి ఈఎంసీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తె 8,910 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి అవకాశాల లభించనున్నాయి.ఇప్పటికే డిక్సిన్ కొప్పర్తిలో తమ ప్లాంట్ ను ప్రారంబించింది. ఈ రెండు ఈఎంసీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 75 లక్షల ఏసీలు మన రాష్ట్రంలో తయ్యారు అయ్యే విధంగా ప్రణాళికలు రచించింది ప్రభుత్వం.
గత ఏడాది మార్చిలో విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 23 కంపెనీలతో ఒప్పందాలు ద్వారా 15,711 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది ప్రభుత్వం. తద్వారా మరో 55,140 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.ముఖ్యంగా ఏసీలు, సెల్ ఫోన్లు, కెమెరాలు, సీసీటీవీ తయారు రంగంలో అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. కొవిడ్ తర్వాత చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంది.