సాధారణంగా విద్య అనేది ఉచితం మన భారత దేశంలో కానీ ఇతరత్రా సదుపాయాలు చూపిస్తూ ప్రైవేట్ పాఠశాలలోఫీజును వేలకు వేలు పెంచేస్తూ, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితే లక్షలు కూడా దాటిపోయింది. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం అందులో తమ పిల్లల్ని చేర్చాలన్న అయ్యేది కాదు, అందుకోసం విద్య అనేది అందరికీ సమానం, డబ్బు ఉన్న వారికే కార్పొరేట్ విద్య అని కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలి అనే దిశగా వైఎస్ఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.
విద్య ప్రతి సామాన్యుడుకి అందుబాటులో ఉండాలి అని ఉచిత విద్య హక్కు చట్టం 2009 ను వైఎస్ఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు అనాథలు, దివ్యాంగులు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కేటాయించాలని అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసింది. అప్పటినుండి ఇప్పటిదాకా పలు దఫాలుగా ప్రవేట్ పాఠశాలలలో ఈ ఉచిత విద్యను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2024-2025 విద్యా సంవత్సరంకి రాష్ట్రంలో ఉన్న 9350 ప్రైవేట్ పాఠశాలలో ఈ ఏడాది నుండి ఉచిత విద్య హక్కు చట్టంని అమలు చేస్తున్నామని సమగ్ర శిక్ష ఎస్ పి డి బి శ్రీనివాసరావు తెలిపారు.
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈరోజు నుంచి మొదలై మార్చి 25వ తేదీల దాకా దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల, నెట్ సెంటర్ల , మీసేవ కేంద్రాల , మండల విద్యాశాఖ అధికారి కార్యాలయలు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. సీబీఎస్సీ/ ఐబీ సిలబస్ పాఠశాలలో చేరాలకునే విద్యార్థులకు 2024 ఏప్రిల్ 1 నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని. స్టేట్ సిలబస్ లో చదవాలనుకునే విద్యార్థులకి 2024 జూన్ 1 నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ విద్య హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,20 వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు 1,44,000 మించకూడదు అని వెల్లడించారు.